Covid Test in Schools: ఇకపై స్కూళ్లలోనూ కరోనా టెస్టింగ్ సెంటర్లు
Covid Test in Schools: స్కూళ్లల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
ఇకపై స్కూళ్లలోనూ కరోనా టెస్టింగ్ సెంటర్లు
Covid Test in Schools: స్కూళ్లల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, థర్డ్ వేవ్ సంకేతాలు నేపథ్యంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ లో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలన్న సీఎం, ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ ఇచ్చుకుంటూ వెళ్లాలన్నారు.