AP CM Jagan letter to Union minister:ఆ ప్రాజెక్టులు కొత్తవి కాదు..కేంద్ర మంత్రి షెకావత్ కు జగన్ లేఖ!

AP CM Jagan letter to Union minister:కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు సీఎం జగన్‌ లేఖ

Update: 2020-08-11 14:51 GMT
AP CM YS Jagan mohan Redddy (file photo)

ఆంధ్రప్రదేశ్ నీటి ప్రాజెక్టుల విషయంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ నుంచి వచ్చిన లేఖకు సీఎం జగన్‌ ఈరోజు ప్రత్యుత్తరమిచ్చారు.

కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజేక్తులేవీ కొత్తవి కావని జగన్ తన లేఖలో కేంద్రానికి స్పష్టం చేశారు. మొత్తం ఐదు పేజీల ఈ లేఖలో సిఎం జగన్ ప్రస్తావించిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

- రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించి అజెండా ఖరారు చేశాం

- రాష్ట్రం తరఫున మాట్లాడేందుకు అజెండా ఖరారు చేశాం

- సమావేశానికి సంబంధించి ఏపీ స్పందన లేదంటూ ఈనెల 7న రాసిన లేఖ సరికాదు

- కృష్ణా నదీ జలాల ట్రైబ్యునల్‌ కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్టులు ఉన్నాయి.

2015లో కేఆర్‌ఎంబీ సమావేశంలోనూ తెలంగాణ, ఏపీ మధ్య అంగీకారం కుదిరింది

- కృష్ణా నదీ నీటి పంపకాల్లో తెలంగాణ, ఏపీ మధ్య ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదు

- రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కేవలం ఉన్న ప్రాజెక్టులకు నీటిని అందించడంతో పాటు సమర్థంగా కాల్వల వ్యవస్థను వినియోగించుకోవడమే

- రాయలసీమ ఎత్తిపోతల ద్వారా ఎలాంటి అదనపు ఆయకట్టు సాగులోకి రాదు. నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరగదు

- పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా సమర్థ వినియోగానికే ఎత్తిపోతల. రాయలసీమ ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కాదని మనవిచేస్తున్నా.

- కృష్ణా నదిపై తెలంగాణ చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, దిండి ఎత్తిపోతలకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలై ఉంది. ఆ రెండు ప్రాజెక్టులు తెలంగాణలో కొత్త కాల్వ వ్యవస్థను, ఆయకట్టును సృష్టిస్తున్నాయి

- మొదట అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ ఇచ్చిన నీటి వాటాకు బద్ధులై ఉంటామని తెలంగాణ చెప్పింది. అనంతరం పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల నిర్మాణాలను తెలంగాణ చేపట్టింది

ఈ నిర్మాణాలను నిలుపుదల చేయాల్సిందిగా అపెక్స్‌ కౌన్సిల్‌ తెలంగాణను ఆదేశించలేదు.

- రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనైనా ఈ అంశాలు పరిష్కారమవుతాయని భావించాం. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరగకుండా ఆగిపోయింది.

మొత్తమ్మీద నీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం రాసిన లేఖకు స్పష్టిమైన జవాబును ఈరోజు సిఎం జగన్ ఇచ్చారని భావించవచ్చు.  

Tags:    

Similar News