YSR Bima: బీమా పూర్తి ఖర్చు బాధ్యత ప్రభుత్వానిదే- సీఎం జగన్‌

YSR Bima: కరోనా ఆర్థిక సంక్షోభంలోనూ ఏపీ సర్కార్ సంక్షేమ పథకాల జోరు కొనసాగిస్తోంది.

Update: 2021-07-01 11:02 GMT

YSR Bima: బీమా పూర్తి ఖర్చు బాధ్యత ప్రభుత్వానిదే- సీఎం జగన్‌

YSR Bima: కరోనా ఆర్థిక సంక్షోభంలోనూ ఏపీ సర్కార్ సంక్షేమ పథకాల జోరు కొనసాగిస్తోంది. తాజాగా ఎస్సార్ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టారు. వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించిన ఈ పథకం ద్వారా 2021-22 ఏడాదికి 1.32 కోట్ల పేద కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలతో వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. వర్చువల్ విధానం ద్వరా పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్సార్ బీమా పథకానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారందరికీ వర్తించే విధంగా కొత్తగా వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు సీఎం తెలిపారు. కుటుంబ పెద్ద సహజ మరణం పొందినా ప్రమాదవశాత్తూ మరణించినా పరిహారం అందేలా వైఎస్ఆర్ బీమా పథకాన్ని తీర్చిదిద్దారు. 2020 ఏప్రిల్ నుంచి కేంద్రం ఈ పథకం నుంచి తప్పుకున్నా తమ ప్రభుత్వం కొనసాగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

మరోవైపు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో 5 లక్షల వార్షిక ఆదాయం కలిగినవారిని ఆరోగ్యశ్రీలో చేర్చామని వైఎస్ జగన్ తెలిపారు. వేయికి పైగా రోగాల్ని గుర్తించి ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చినట్టు జగన్ చెప్పారు. నూతన మార్గదర్శకాలతో ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ బీమా పథకాన్ని బ్యాంకులతో సంబంధం లేకుండా అమలు చేస్తామన్నారు. వైఎస్ఆర్ బీమా పథకంపై సందేహాల్ని నివృత్తి చేసేకునేందుకు 155214 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

ఇక 18-50 ఏళ్ల వ్యక్తి సహజ మరణమైతే లక్ష రూపాయులు, 18-70 ఏళ్ల వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేదా అంగవైకల్యమైనా 5 లక్షల రూపాయలు అందిస్తామన్నారు. పేద కుటుంబాలపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వమై మొత్తం ఖర్చు భరిస్తుందన్నారు. 2021-22 ఏడాదికి 1.32 కోట్ల పేద కుటుంబాలకు 750 కోట్లతో బీమా కల్పిస్తామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు పూర్తి బాధ్యతలు అప్పగించామని వైఎస్ జగన్ తెలిపారు. బీమా మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించనుందని స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలోనూ పేదలకు అండగా వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించడం పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News