వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

Update: 2020-10-21 08:05 GMT

ఏపీ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. నిరుపేదలకు అండగా వైఎస్సార్ బీమా పథకాన్ని సీఎం జగన్‌ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభించారు. ప్రతీ కుటుంబం సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్న సీఎం కేంద్రం తప్పుకున్నా రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం ఖర్చును భరిస్తుందన్నారు. ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 'వైఎస్సార్‌ బీమా పథకం' ద్వారా బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరనుంది. కుటుంబ పెద్దకు జీవన భద్రత కల్పించేందుకు తీసుకొచ్చిన ఈ బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. కోవిడ్‌ వల్ల ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమలు చేసినట్టు సీఎం జగన్‌ తెలిపారు.

Full View


Tags:    

Similar News