జీవక్రాంతి పథకం ప్రారంభించిన సీఎం జగన్‌

Update: 2020-12-10 07:07 GMT

ఎన్నికల హామీ అమలుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలో సీఎం జగన్‌ జీవక్రాంతి పథకం ప్రారంభించారు. అక్క చెల్లెమ్మలు తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా నిలదొక్కుకొని జీవన స్థాయిని, ప్రమాణాలను పెంచుకోవాలన్నదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు సీఎం జగన్‌.

ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయస్సు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సాయంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేస్తారు. 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేసేందుకు రూ.1868.63 కోట్లు వ్యయం చేయనున్నారు. కాగా ఈ పథకాన్ని మూడు విడతలుగా అమలు చేయనున్నారు. మొదటి విడతలో 2021 మార్చి వరకు 20 వేల యూనిట్లు, రెండవ విడతలో 2021 ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు 1,30,000 యూనిట్లు, మూడవ విడతలో 2021 సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు 99,000 యూనిట్లు.. మొత్తం మూడు విడతలుగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. 

Tags:    

Similar News