CM Jagan: ఇవాళ లేదా రేపు హస్తినకు ఏపీ ముఖ్యమంత్రి
CM Jagan: ఆసక్తిగా మారిన సీఎం జగన్ ఢిల్లీ టూర్
CM Jagan: ఇవాళ లేదా రేపు హస్తినకు ఏపీ ముఖ్యమంత్రి
CM Jagan: లండన్ పర్యటన ముగించుకుని ఏపీకి చేరుకున్న సీఎం జగన్.. ఇప్పుడు ఢిల్లీ టూర్‌కు రెడీ అవుతున్నారు. ఇవాళ లేదా రేపు ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జగన్ భేటీ అవుతారని సమాచారం. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే కీలక బిల్లులకు వైసీపీ మద్దతు కోసం చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరీ ముఖ్యంగా సీఎం జగన్ లండన్‌లో ఉండగానే ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ వేడి చల్లారక ముందే సీఎం జగన్ హస్తినకు వెళ్తుండటం.. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో సీఎం జగన్ ఢిల్లీ టూర్ సర్వత్రా ఆసక్తి నెలకొంది.