ఢిల్లీకి బయల్దేరిన సీఎం జగన్
*కేంద్రమంత్రులతోనూ జగన్ సమావేశం *పోలవరం ప్రాజెక్టు సవరించిన అంశాలపై చర్చ *మూడు రాజధానుల ఏర్పాటుపై చర్చించే ఛాన్స్
జగన్ ఫైల్ ఫోటో
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రాత్రి 10 గంటలకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ కానున్నారు. పలువురు కేంద్రమంత్రులతోనూ జగన్ సమావేశమయ్యే అవకాశముంది. అటు పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు సహకారం అందించాలని అమిత్ షాను సీఎం ఇప్పుడే కోరే అవకాశం ఉంది.
వచ్చే మూడు, నాలుగు నెలల్లో విశాఖలో కార్యనిర్వహక రాజధానిని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు సీఎం ఢిల్లీ పర్యటకు ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతోపాటు రాష్ట్రంలో దేవాలయాల్లో విగ్రహాలపై జరుగుతున్న దాడులు, పోలీసుల దర్యాప్తులో తేలిన అంశాలు షాకు వివరించే అవకాశం ఉంది.