Chandrababu Naidu: ఆగస్టు 15న గుడివాడకు ఏపీ సీఎం చంద్రబాబు
Chandrababu Naidu: సీఎం బాధ్యతలు చేపట్టాక తొలిసారి గుడివాడకు చంద్రబాబు
Chandrababu Naidu: ఆగస్టు 15న గుడివాడకు ఏపీ సీఎం చంద్రబాబు
Chandrababu Naidu: కృష్ణాజిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. ఈనెల 15న సీఎం చంద్రబాబు గుడివాడకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంకు చేరుకోనున్న చంద్రబాబు.. అక్కడ నుంచి రామబ్రహ్మం మున్సిపల్ పార్క్‌కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై నిమిషాలకు తిరిగి వెళ్తారు. సీఎంగా ఎన్నికైన అనంతరం తొలిసారి చంద్రబాబు గుడివాడకు వస్తుండటంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.