Chandrababu Naidu: ఆర్థికశాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష
Chandrababu Naidu: రాష్ట్రానికి ఉన్న అప్పులు, లెక్కలపై చంద్రబాబు ఆరా
Chandrababu Naidu: ఆర్థికశాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష
Chandrababu Naidu: ఆర్థికశాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించనున్నారు. రాష్ట్రానికి ఉన్న అప్పులు, లెక్కలపై వివరాలు రాబట్టనున్నారు. పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై సమీక్షించనున్న ఏపీ సీఎం.. ఆ పెండింగ్ బిల్లుల వివరాలు కోరుతూ ఇప్పటికే శాఖల వారీగా వివరాలు కోరింది ఆర్థిక శాఖ. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు.. కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై ఫోకస్ చేయనున్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థికశాఖ ప్రతిపాదించింది. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టే అంశంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేతపత్రంపై చంద్రబాబు కసరత్తు చేయనున్నారు.