ఆడబిడ్డల జోలికొస్తే... చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

Update: 2025-02-15 16:47 GMT

AP CM Chandrababu naidu warns them who harms women, girls in AP with strict warning 

Chandrababu Naidu latest news: జీరో పావర్టీ తన జీవిత ఆశయం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. "పేదరికం లేని సమాజాన్ని చూడలనేదే తన కల అని ఎన్టీఆర్ ఎప్పుడూ చెబుతుండే వారు. అందుకే ఆయన కలను నిజం చేయాలని తన జీవిత ఆశయంగా పెట్టుకున్నాను" అని చంద్రబాబు చెప్పారు. అందుకోసం ఈ సంవత్సరం P4 అనే పాలసీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. P4 అంటే పబ్లిక్, ప్రైవేట్ పీపుల్ పార్ట్‌నర్‌షిప్ అని అర్థం వివరించారు.

ఈ పీ4 ద్వారా ప్రజల ఆదాయం పెంచి పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో ఏర్పాటు చేసిన మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ప్లాంట్ ప్రారంభోత్సం సందర్భంగా బహిరంగ సభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

తను అధికారంలోకి వచ్చాకా గ 8 నెలలుగా ఎప్పుడూ చేయనన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. అభివృద్ధి విషయంలో అన్నీ చేయాలని ఉందన్నారు. పరుగెత్తాలని ఉందన్నారు. కానీ గల్లాపెట్టె ( రాష్ట్ర ఖజానా) మాత్రం సహకరించడం లేదన్నారు. కానీ ఇదంతా తాత్కాలికమైన ఇబ్బందే అన్నారు. ఈ ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమించే శక్తి తనకు ఉందన్నారు.

Full View

గత వైసీపీ ప్రభుత్వంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు, నేరాలు పెరిగిపోయాయని చంద్రబాబు నాయుడు అన్నారు. తమ ప్రభుత్వం అలాంటి నేరాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. 

Tags:    

Similar News