AP CID: చట్టప్రకారమే అయ్యన్నను అరెస్ట్ చేశాం- డీఐజీ సునీల్

AP CID: చట్టప్రకారమే అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేశామని డీఐజీ సునీల్ నాయక్ తెలిపారు.

Update: 2022-11-03 08:57 GMT

AP CID: చట్టప్రకారమే అయ్యన్నను అరెస్ట్ చేశాం- డీఐజీ సునీల్

AP CID: చట్టప్రకారమే అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేశామని డీఐజీ సునీల్ నాయక్ తెలిపారు. అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులు జలవనరుల శాఖ అధికారుల సంతకాన్ని ఫోర్జరీ చేశారని అందిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఫేక్ ఎన్ఓసీ వినియోగించి 0.26 సెంట్స్ ల్యాండ్ కబ్జా చేసారని తెలిపారు. అసిస్టెంట్ ఇంజనీర్‌ని ఇంటికి పిలిపించి బెదిరించి సంతకం చేయించారన్న ఆరోపణలు వచ్చాయని చెప్పారు. వీటిపై ప్రాథమిక విచారణ తరువాతే అయ్యన్న పాత్రుడుని అరెస్ట్ చేసామన్నారు. ఏ-1గా అయ్యన్నపాత్రుడు, ఏ-2గా విజయ్, ఏ-3గా రాజేష్ ఉండగా... ఏ-1 అయ్యన్నపాత్రుడు, ఏ-3 రాజేష్ లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Tags:    

Similar News