AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. నామినేటెడ్ పదవుల్లో..
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. నామినేటెడ్ పదవుల్లో..
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎస్సి, ఎస్టీ, బిసి, మహిళా పారిశ్రామిక వేత్తలను ఆదుకునేలా ప్రభుత్వ పాలసీలను రూపొందిస్తూ,.. నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు MSME పాలసీలో మార్పులకు నేటి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విద్యుత్ సహా పలు విభాగాల్లో ఎస్సి, ఎస్టీ, బిసి, మహిళా వర్గ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది కూటమి ప్రభుత్వం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూత అందించేలా పాలసీల్లో సవరణలకు కేబినెట్ అంగీకరించింది. 2014-19 కాలంలో నీరు చట్టు పనులకు సంబంధించి ఇంకా పెండింగ్ లో ఉన్న బిల్లులకు మంత్రివర్గం ఆమోదించింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణానికి కొత్త టెండర్లు పిలిచే విషయమై చర్చించారు.