AP Budget 2025-26: పోలవరం ప్రాజెక్టుకు రూ.6,705 కోట్లు

పోలవరం ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ లో రూ. 6,705 కోట్లు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు సర్కార్ టార్గెట్ ఫిక్స్ చేసింది.

Update: 2025-02-28 06:45 GMT

AP Budget 2025-26: బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు రూ.6,705 కోట్లు

పోలవరం ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ లో రూ. 6,705 కోట్లు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు సర్కార్ టార్గెట్ ఫిక్స్ చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం అందిస్తోంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రూ. 5,936 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా మరో రూ.12,157 కోట్లు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు రూ. 30,436.95 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో 5,936 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.6,705 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను రెండు రాష్ట్రాలు ఖర్చు చేస్తున్నాయి.

2014 -19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతామని తీసుకున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని టీడీపీ, జనసేన అప్పట్లో విమర్శలు చేశాయి. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల విడుదలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు కేంద్రం కూడా నిధులను విడుదల చేస్తోంది.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ను 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. 2027 డిసెంబర్ నాటికి ప్రధాన డ్యాం పనుల్లో మిగిలిన వాటిని పూర్తి చేస్తారు. ఈ పనులకు ముందే అంటే 2026 అక్టోబర్ నుంచి పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తారు.

అప్రోచ్ ఛానల్ ను 2026 జూన్ లోపు, స్పెల్ ఛానల్ 2027 జులైకి, పైలట్ ఛానల్ 2027 మే నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. 2025 ఏప్రిల్ నాటికి భూసేకరణను పూర్తి చేయనున్నారు. ఇంకా పెండింగ్ లో ఉన్న 16 వేల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది. ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ 2027 ఫిబ్రవరి, ఎగ్జిట్ చానల్ 2027 ఏప్రిల్, 2027 ఫిబ్రవరికి టన్నెల్, 2026 చివరికి ట్విన్ టన్నెల్స్ పూర్తి చేయనున్నారు.

Tags:    

Similar News