AP Budget 2025-26: ఈ విద్యా సంవత్సరం నుంచే తల్లికి వందనం

ఎన్నికల మేనిఫెస్టో‌లో ఇచ్చిన హామీ మేరకు 2025-26 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయించింది.

Update: 2025-02-28 07:22 GMT

AP Budget 2025-26: ఈ విద్యా సంవత్సరం నుంచే తల్లికి వందనం

ఎన్నికల మేనిఫెస్టో‌లో ఇచ్చిన హామీ మేరకు 2025-26 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయించింది. సూపర్ సిక్స్ హామీలో భాగంగా తల్లికి వందనం పథకం కింద బడ్జెట్ లో ప్రభుత్వం రూ.9,407 కోట్లు కేటాయించింది.

ఈ పథకం కింద చదువుకునే విద్యార్ధులకు ప్రతి ఏటా రూ. 15 వేలు ఆర్ధిక సహాయం అందించనుంది. ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఈ పథకం వర్తింపచేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తించనుంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనున్నారు. ఒకటి నుంచి 12 తరగతుల వరకు చదివే విద్యార్థులు మాత్రమే ఈ పథకం కింద అర్హులు. విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలో ఈ డబ్బును జమ చేస్తారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం జూన్ లో ప్రారంభం కానుంది. అయితే జూన్ లో స్కూల్స్ ప్రారంభించే సమయానికి ఈ నిధులను తల్లుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.

ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ లో పెన్షన్ ను రూ. 4 వేల నుంచి రూ. 15 వేల వరకు పెన్షన్ అందిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికిబడ్జెట్ లో రూ.27,518 కోట్లు కేటాయించింది చంద్రబాబు సర్కార్. ఇక దీపం 2 పథకం కింద ప్రతి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని హమీఇచ్చారు. ఈ హామీలో భాగంగా దీపం పథకానికి ఈ బడ్జెట్ లో రూ. 2,601 కోట్లు కేటాయించారు.

Tags:    

Similar News