Vizag: కేటీఆర్‌పై ఏపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ ఫైర్
Vizag Steel Plant: ఉక్కు ఉద్యమానికి కేటీఆర్ మద్దతు తెలపడం హాస్యాస్పదం - సత్యకుమార్
సత్య కుమార్ & మినిస్టర్ కేటీఆర్ (ఫైల్ ఫోటో )
Vizag Steel Plant: ఉక్కు ఉద్యమానికి కేటీఆర్ మద్దతు ప్రకటించడంపై ఏపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌పై మంత్రి కేటీఆర్‌కు అంత ప్రేమే కనుక ఉంటే బయ్యారం గనులను విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే ఉద్యమానికి మద్దతు అంటూ కేటీఆర్ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సీఎం జగన్‌తో మాట్లాడి పరిశ్రమపై చర్చించాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు.