ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా అరెస్టు.., సత్తెనపల్లి పోలీసు స్టేషన్‌కు తరలింపు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అరెస్టు చేసి సత్తెనపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని కన్నా ట్విట్.

Update: 2019-09-16 05:36 GMT

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన అనంతరం సత్తెనపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. గురజాలలో బహిరంగ సభను నిర్వహించడానికి బీజేపీ ప్రయత్నించింది. కాగా... సభకు అనుమతిలేదని పోలీసులు తెలిపారు. ఉద్రిక్తత పరిస్థితుల దృష్యా గురజాల నియోజకవర్గంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ సర్కార్‎పై ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పల్నాడులో అరాచక పాలన జరుగుతోందని ప్రశ్నిస్తే జగన్ సర్కారు ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. గతంలో ప్రతిపక్షనేతగా జగన్ పోరాటాలు చేశారని గుర్తుచేశారు.‎ వైసీపీ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని..., రాజకీయ కక్ష్య సాధింపులకు పాల్పడటం సరైంది కాదన్నారు. 



Tags:    

Similar News