నేడు తాడేపల్లిలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ భేటీ
Tadepalle: తొలిసారి సమావేశానికి హాజరుకానున్న తరుణ్‌చుగ్
నేడు తాడేపల్లిలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ భేటీ
Tadepalle: నేడు తాడేపల్లిలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ భేటీ కానుంది. తొలిసారి ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి తరుణ్‌చుగ్ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఏపీలో పొత్తులపై నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు. ఏపీ తాజా రాజకీయ పరిణామాలు, పొత్తులపై ఇవాళ స్పష్టత రానుంది. నేడు జరిగే కోర్ కమిటీ భేటీలో బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పలువురు బీజేపీ నేతలు హాజరవుతారు.