Somu Veerraju: ఏపీలో జనసేనతో కలిసి పోరాటం చేస్తాం
Somu Veerraju: 75 వారాల పాటు స్వాతంత్ర్య సమరయోధులను సత్కరిస్తాం -సోము
పవన్ కళ్యాణ్ & సోము వీర్రాజు (ఫైల్ ఇమేజ్)
Somu Veerraju: ఏపీలో ప్రజా సమస్యలపై జనసేనతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. రాష్ట్రంలో 75 వారాల పాటు స్వాతంత్ర్య సమరయోధులను సత్కరించే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండాతో పోరాటం చేస్తామని చెప్పారు. దేశంలో అవినీతి లేని అభివృద్ధి వైపు బీజేపీ నడుస్తోందని, ఏపీలోనూ అదే విధంగా బీజేపీ, జనసేన అడుగులు పడుతున్నాయని చెప్పారు సోము వీర్రాజు.