డిసెంబర్‌ మొదటివారం నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

Update: 2019-11-17 07:41 GMT

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ మొదటివారం నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. సమావేశాలు 10 నుంచి 15 రోజులపాటు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ యంత్రాంగం ఐదురోజుల ముందే ఏర్పాట్లు చేయాలనీ నిర్ణయించింది. అసెంబ్లీ కార్యకలాపాల్లో ఐటీ సేవల వినియోగంపై చర్చించేందుకు శనివారం ఢిల్లీలో జరిగిన ప్రిసైడింగ్‌ అధికారుల సమావేశంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీ కార్యకలాపాల కంప్యూటరీకరణ మూడు దశల వరకు పూర్తయిందని, పూర్తి డిజిటలైజేషన్‌కు సంబంధించిన ప్రతిపాదనలను డిసెంబర్‌ 17లోపు కేంద్రానికి పంపాలని నిర్ణయించామన్నారు.. డిసెంబర్ రెండో తేదీనుంచి అసెంబ్లీ సమావేశాలు జరిపే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News