AP Apollo Tyres Launch: రాష్ట్రానికి కంపెనీ తీసుకురావడం.. ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌కు రంగులు వేసినంత ఈజీ కాదు

AP Apollo Tyres Launch: ఆంధ్రప్రదేశ్ లో అపోలో టైర్స్ యూనిట్ నుంచి తొలి టైరను నేడు విడుదల చేశారు. 2018లో చిత్తూరు జిల్లా చిన పాండూరులో అపోలో టైర్స్ పరిశ్రమ ఏర్పాటైంది.

Update: 2020-06-26 11:43 GMT
Nara Lokesh file Photo

AP Apollo Tyres Launch: ఆంధ్రప్రదేశ్ లో అపోలో టైర్స్ యూనిట్ నుంచి తొలి టైరను నేడు విడుదల చేశారు. 2018లో చిత్తూరు జిల్లా చిన పాండూరులో అపోలో టైర్స్ పరిశ్రమ ఏర్పాటైంది. ఈ పరిశ్రనుంచి వర్చువల్ సమావేశం ద్వారా ఛైర్మన్ ఓంకార్ ఎస్ కన్వర్ విడుదల చేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. రాబోయే రోజుల్లో ఉత్పత్తిని మరింత పెంచుతామని ఓంకార్ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఏపీలో అపోలో టైర్స్ తమ హయంలోనే వచ్చిందన్నారు.

ఏపీ యువతకు స్వరాష్ట్రంలోనే ఉపాధి కల్పించాలన్న తపనతో, రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తెచ్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము చేసిన కృషి ఇప్పుడు ఫలిస్తోంది అన్నారు. చిత్తూరు జిల్లా, చిన్నపండూరులో 2018లో ఏర్పాటు చేసిన అపోలో టైర్స్ నుంచి ఈరోజు ఉత్పత్తి ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.

రాష్ట్రానికి ఒక కంపెనీ తీసుకురావడం అంటే పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేసుకున్నంత ఈజీ కాదు అన్నారు. రికార్డ్ టైం లో కంపెనీలు ఏర్పాటు కావాలన్నా, నిరుద్యోగ యువత కి ఉద్యోగాలు కల్పించాలన్నా, అది ఒక చంద్రబాబుకే సాధ్యమన్నారు. తెలుగు దేశం పార్టీ హయాంలో కంపెనీ ఏర్పాటుకి ముందుకు వచ్చి, తొలిదశలో రూ.3,800కోట్ల పెట్టుబడి పెట్టి, ఈరోజు తొలి టైర్ ని విడుదల చేసిన అపోలో టైర్స్‌ వారిని అభినందిస్తున్నాను అన్నారు. కంపెనీ మరింత వృద్ధిచెంది ఆంధ్రరాష్ట్ర యువతకి మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.







 


Tags:    

Similar News