TTD: టీటీడీ అదననపు ఈవో కార్యాలయం వద్ద నిరసన

TTD: అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పడంతో.. ఆందోళన విరమించిన భక్తులు

Update: 2022-01-10 05:55 GMT

టీటీడీ అదననపు ఈవో కార్యాలయం వద్ద నిరసన

TTD: తిరుమలలో భక్తులు ఆందోళనకు దిగారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. రేపటి విఐపీ బ్రేక్ దర్శనం కోసం తాము తెచ్చుకున్న సిఫార్సు లేఖలను స్వీకరించడం కుదరదని సిబ్బంది చెప్పడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన తమకు శ్రీవారి దర్శనం దూరం చేస్తారా అంటూ సిబ్బందిపై మండిపడ్డారు.

భక్తులు ఆందోళనకు దిగడంతో విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు ఏఎస్పీ. రేపు శ్రీవారి ఆలయంలో జరగబోయే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేయడం జరిగిందని వివరించి సర్దిచెప్పారు. అందరికి దర్శనభాగ్యం కల్పిస్తామని చెప్పడంతో భక్తులు ఆందోళన విరమించారు. అనంతరం సిఫార్సు లేఖలు ఉన్న భక్తులకు 300 రూపాయల ప్రత్యేకప్రవేశ దర్శనాన్ని కేటాయించారు.

Tags:    

Similar News