Vijayawada: దుర్గగుడిలో బయటపడ్డ మరో స్కాం

Vijayawada: దుర్గమ్మ చీరల విభాగంలో అక్రమాలు * ఏసీబీ, విజిలెన్స్‌ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు

Update: 2021-04-06 07:21 GMT

విజయవాడ దుర్గ టెంపుల్ (ఫైల్ ఇమేజ్)

Vijayawada: విజయవాడ కనకదుర్గమ్మ చీరల విభాగంలో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. ఏసీబీ, విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. చీరల ధరలు బార్ కోడింగ్ ధరలకు, ఇతర ధరలతో పోల్చి చూస్తే భారీ వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు. 15వేలు విలువైన చీర 2 వేల 5వందలు ఉన్నట్టు గుర్తించారు. 8వేలు, 10వేల రూపాయల విలువైన చీరలు సిబ్బంది బీరువాలో ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

వేల రూపాయల విలువైన చీరలను సిబ్బంది దారి మళ్లిస్తున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.. భక్తులు కానుకగా ఇచ్చిన చీరల వివారాలను రికార్డుల్లోకి ఎక్కించకుండా పక్కదారి పట్టించారు. అమ్మవారికి కానుకగా ఇస్తే ఉద్యోగులు చేతివాటంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Full View


Tags:    

Similar News