Low Pressure: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
Low Pressure: రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతం లో అల్పపీడనం (ఫైల్ ఇమేజ్)
Low Pressure: వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో బలపడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మరోపక్క.. గులాబ్ తుపాను ప్రభావంతో ఏపీ, తెలంగాణలో అక్కడక్కగా వర్షాలు కురుస్తున్నాయి.