వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు

Simhadri Appanna Chandanotsavam: సింహాచలంలో వరాహ లక్ష్మి నరసింహ స్వామి స్వయంభువుగా వెలిశారు.

Update: 2024-05-10 06:22 GMT

వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు

Simhadri Appanna Chandanotsavam: సింహాచలంలో వరాహ లక్ష్మి నరసింహ స్వామి స్వయంభువుగా వెలిశారు. ఏడాదిలో కేవలం 12 గంటలు మాత్రమే భక్తులు స్వామిని నిజరూపంలో దర్శనం చేసుకోవచ్చు. చందనోత్సవంలో భాగంగా స్వామి విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగించి 12 గంటల పాటు భక్తులకు స్వామి నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజున జరిగే పరమ పవిత్రమైన ఉత్సవం చందనోత్సవం నిర్వహించారు.

అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు, వారి కుటుంబ సభ్యులు సింహాచల వరాహ లక్ష్మి నరసింహ స్వామి తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు, చందనం సమర్పించారు. స్వామికి తొలి విడత సమర్పణ తరువాత దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఈ రోజు స్వామిని నిజరూపంలో దర్శించుకున్న వారు సమస్త ఐహిక సుఖాలు పొంది, మోక్షాన్ని పొందుతారని శాస్త్రం చెబుతోంది.



 స్వామి నిజరూప దర్శనానికి వచ్చే భక్తులు ఎండవేడిమి నుండి ఉపశమనం పొందేందుకు దేవస్థానం తరపున కూలర్లు ఏర్పాటు చేసింది. కొండపైకి ఉచిత బస్‌లు మినహా మరే ఇతర వాహనాలు కొండపైకి అనుమతించడం లేదు. మరోవైపు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి లక్ష్మినరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నారని ఆయన వెల్లడించారు.  

Tags:    

Similar News