నడిసంద్రంలో చిక్కుకున్న వానరం.. 3నెలలుగా సముంద్రంలో.. ఒడ్డుకు చేరగానే...

Monkey Rescue: ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించిన కోతి...

Update: 2022-04-08 01:54 GMT

నడిసంద్రంలో చిక్కుకున్న వానరం.. 3నెలలుగా సముంద్రంలో.. ఒడ్డుకు చేరగానే...

Monkey Rescue: నడి సంద్రంలో చిక్కుకున్న వానరాన్ని యానిమల్ వారియర్స్ కాపాడారు. 3నెలలుగా తిండి లేదు. ఎటువైపు వెళ్లాలో తెలియదు. విపరీతమైన ఎండను భరించింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని క్షణమొక గండంగా గడిపింది. సముద్రంలోని కాంక్రీట్ వేవ్ బ్రేకర్ల మీద అలా ఒకటి కాదు రెండు కాదు 3నెలలు కాలం వెల్లదీసింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు రెండు కిలోమీటర్ల దూరంలో హోప్ ఐలాండ్ అనే దీవి ఉంది.

దీనికి కూత వేటు దూరంలో ఐలాండ్ బ్రేక్ వాటర్‌ను నిర్మించారు. వీటిపైకి ఎలా వచ్చిందో తెలియదు.. ఎక్కడి నుంచి వచ్చిందో.. ఓ వానరం చిక్కుకు పోయింది. అటుగా వెళ్లిన మత్స్యకారులు దానికి కాపడానికి ప్రయత్నించినా కుదరలేదు. చేసేదేమి లేక కాస్త ఆహారం అందించేవారు. అలా పస్తులు, అవస్థలతో 3 నెలల పాటు అక్కడే ఉంది ఆ కోతి. ఇక విషయం తెలుసుకున్న ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఏడుగురు యువతీయువకులు దానిని కాపాడాలని డిసైడ్ అయ్యారు.

నడి సముద్రంలో వానరాన్ని బంధించడం రిస్క్ అని తెలిసినా సాహసం చేశారు. అటవీ శాఖ అధికారుల సమక్షంలో ఆ వానరం వద్దకు బోట్ లో వెళ్లారు. దానికి ఆహారం అందించి, దానిని మచ్చిక చేసుకున్నారు. బోనులో బంధించి క్షేమంగా ఒడ్డుకుచేర్చారు. కాకినాడకు తీసుకువచ్చి వదిలేయగానే. ఆ వానరం ఎక్కడ లేని సంతోషంతో ఎగిరి గంతులేస్తూ పారిపోయింది. ప్రకాశం జిల్లా కొత్తపట్టణానికి చెందిన స్వచ్ఛంద సంస్థ యానిమల్ వారియర్స్‌ కన్జర్వేషన్ సొసైటీ హెల్ప్ లైన్‌ లో పనిచేస్తున్న సంజీవ్‌ వర్మ, అమర్‌నాథ్, మనీశ్, రామకృష్ణతోపాటు హైదరాబాద్‌ కు చెందిన సంతోషి, అనిరుథ్, కాకినాడ యానిమల్‌ రెస్క్యూ బృందం ఈ వానరాన్ని కాపాడింది.

Tags:    

Similar News