Anil Kumar: సీఎం జగన్‌తో ముగిసిన అనిల్ కుమార్ యాదవ్ సమావేశం
Anil Kumar: సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన సమావేశం
Anil Kumar: సీఎం జగన్‌తో ముగిసిన అనిల్ కుమార్ యాదవ్ సమావేశం
Anil Kumar: సీఎం జగన్‌తో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమావేశం ముగిసింది. సుమారు 45 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. నెల్లూరు జిల్లా, సిటీలో పార్టీ పరిస్థితులు, లీడర్ల మధ్య విభేదాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ పటిష్టంగా ఉందని.. పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని జగన్ సూచించారు. ఇక నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని అనిల్ కుమార్ యాదవ్ కోరారు. ఎమ్మెల్యే విజ్నప్తులపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు..