AP Raj Bhavan Employee's Tests Positive: రాజ్‌భవన్ భ‌ద్రతా సిబ్బందికి క‌రోనా

AP Raj Bhavan Employee's Tests Positive: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ్‌భన్‌లో మళ్లీ కరోనా కలకలం మొద‌లైంది. అక్కడ పనిచేస్తున్నభద్రతా సిబ్బందిలో 15 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.

Update: 2020-07-30 04:25 GMT
ap raj bhavan

AP Raj Bhavan Employee's Tests Positive: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ్‌భవన్‌లో మళ్లీ కరోనా కలకలం మొద‌లైంది. అక్కడ పనిచేస్తున్నభద్రతా సిబ్బందిలో 15 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన పాత భద్రతా సిబ్బందిని క్వారంటైన్‌కి పంపిస్తూ వారి స్థానంలో సుమారు 72 మంది కొత్త సిబ్బందిని నియమించారు. రాజ్‌భవన్‌ను శానిటైజ్‌ చేయించారు. దీంతో రాజ్ భవన్ వద్ద కొంత ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. గతంలోనూ ఇక్కడ పనిచేసే పలువురు అధికారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ పదిహేను మందికి పాజిటివ్‌ రావడం కలకలం రేపుతోంది. దీంతో అందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు కరోనా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది.

అటు తాజాగా తమిళనాడు ద‌రాజ్ భవన్‌లోనూ ముగ్గురికి కరోనా సోకింది. దీంతో గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. వైద్యుల సూచన మేరకు ఆయన ఏడు రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారని రాజ్‌భవన్‌ అధికారులు వెల్లడించారు. గవర్నర్‌ ఆరోగ్యంగానే ఉన్నారని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారని చెప్పారు. 

Tags:    

Similar News