ఏపీ రాజ్‌భవన్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

ఏపీ రాజ్‌భవన్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్
x
Highlights

ఏపీలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా ఉద్ధృతి రోజు రోజుకి పెరుగుతుంది. బుధవారం ఒక్కరోజు 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది....

ఏపీలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా ఉద్ధృతి రోజు రోజుకి పెరుగుతుంది. బుధవారం ఒక్కరోజు 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1332 కి చేరింది. ఏపీ రాజ్‌భవన్‌కు చెందిన నలుగురికి ఇప్పటికే కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా, ఇప్పుడు మరో ఇద్దరు వైరస్ బారిన పడ్డారు. రాజ్‌భ‌వ‌న్‌లో పనిచేసే ఉద్యోగితో పాటు, అక్కడ ఉండే 108 అంబులెన్స్‌ డ్రైవరుకు కూడా వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో వారి కుటుంబ స‌భ్యుల‌ను కూడా క్వారంటైన్‌కు త‌ర‌లించారు. ఇప్పటికే గవర్నర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, స్టాఫ్‌ నర్స్‌, ఇద్దరు అటెండర్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా నమోదైన ఇద్దరితో కలిపి రాజ్‌భవన్‌లో బాధితుల సంఖ్య ఆరుకు చేరింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories