జగనన్న విద్యాకానుక ప్రారంభం!

Jagananna Vidya Kanuka : జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం లోని పునాదిపాడు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్

Update: 2020-10-08 07:28 GMT

Jagananna Vidya Kanuka : జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం లోని పునాదిపాడు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్.. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న 1 -10 వరకు చెందిన 42.34 లక్షల మంది విద్యార్ధులకు ఈ కీట్లు పంపిణి చేయనున్నారు. ఒక్కో కిట్లో 3 జతల యూనిఫాం, జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, పుస్తకాలు, నోట్స్ బుక్స్, బ్యాగ్, మాస్క్ ఉంటాయి.. నవంబర్ రెండు లోపు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈ కీట్లు అందనున్నాయి..

ఇక ఈ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని మార్చే శక్తి కేవలం విద్యకి మాత్రమే ఉందని అన్నారు. అందుకు ఇలాంటి ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనందంగా ఉందని అన్నారు. రూ. 650కోట్ల ఖర్చుతో జగనన్న విద్యాకానుకను అందిస్తున్నట్టుగా జగన్ వెల్లడించారు. ప్రతి ఒక్క విద్యార్ధి గొప్పగా చదువుకోలాని ఆశిస్తున్నట్టుగా జగన్ చెప్పుకొచ్చారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనున్నట్టుగా జగన్ తెలిపారు. విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టమన్న జగన్, ప్రపంచంతో పోటీపడే పరిస్థితి మన పిల్లలో రావాలని జగన్ అన్నారు.

Tags:    

Similar News