ఆంధ్రా వర్సిటీలో 'అంధేరా' దృశ్యాలు.. కండోమ్స్, డ్రగ్స్, మద్యం బాటిళ్లు, ఇంకా...

Andhra University: *కాలేజీకి దూరంగా తుప్పల్లో విద్యార్థుల చీకటి కార్యకలాపాలు *అవాక్కయిన యూనివర్సిటీ అధికారులు

Update: 2022-05-27 07:43 GMT

ఆంధ్రా వర్సిటీలో 'అంధేరా' దృశ్యాలు.. కండోమ్స్, డ్రగ్స్, మద్యం బాటిళ్లు, ఇంకా...

Andhra University: ఆంధ్రా యూనివ‌ర్సిటీ అసాంఘిక కార్యకలాపాల‌కు అడ్డాగా మారింది. విచ్చలవిడిగా వ్యభిచారం, డ్రగ్స్‌ వినియోగం జరుగుతున్నట్టు బయటపడింది. ఇది చూసిన యూనివ‌ర్శిటీ అధికారులు ఆవాక్కయ్యారు. ఇటీవల యూనివ‌ర్శిటీ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. ఇంజినీరింగ్ కాలేజీ స‌మీపంలో తుప్పల‌ు నిండిన ప్రాంతాన్ని వారం రోజులుగా శుభ్రం చేయిస్తున్నారు.

అయితే ఇంజనీరింగ్‌ కళాశాల బాయ్స్‌ హాస్టల్‌ పరిసరాల్లో తుప్పలు తొలగిస్తుండగా కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతంలో వెదురుమొక్కలు గుబురుగా పెరగడంతో అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుని, ఏపుగా పెరిగిన చెట్లపై మంచం మాదిరి తయారుచేసి, వాటిపై పరుపులు వేశారు. పైకి వెళ్లడానికి నిచ్చెనలు ఏర్పాటు చేశారు. అక్కడ భారీ సంఖ్యలో పెట్టెల‌తో కండోమ్స్ బ‌య‌ట‌ప‌డ్డాయి.

అలాగే భారీఎత్తున ఖాళీ మ‌ద్యం బాటిళ్లు కూడా బ‌య‌ట‌ప‌డ్డాయి. అంతేకాదు... మ‌త్తు ఇంజక్షన్లు కూడా బ‌య‌ట‌ప‌డ్డాయి. యువకులు అక్కడకు వచ్చి మత్తుమందులు సేవిస్తూ, మద్యం తాగుతున్నట్లు తెలుస్తోంది. క్యాంపస్‎లోకి గుర్తింపు కార్డు లేకుండా ఎవరైనా వస్తే వెనక్కి పంపించేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది హాస్టల్‌ పరిసరాలను మాత్రం పట్టించుకోవడం మానేశారు. దాంతో

Tags:    

Similar News