Andhra Pradesh Weather Report: ఏపీలో మూడు రోజులు భారీవర్షాలు

Andhra Pradesh Weather Report: బంగాళాఖాతం, ప‌రిస‌ర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాగల 3 రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది.

Update: 2020-08-15 14:27 GMT

Andhra Pradesh Weather Report: బంగాళాఖాతం, ప‌రిస‌ర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాగల 3 రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. భారీ వర్షాలు, వరద ఉదృతి దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అలలు 3.5 నుండి 4.3 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశం ఉంద‌ని, దీంతో సముద్రంలో అలజడి ఎక్కువ‌గా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల శాఖ కమిషనర్ సూచించారు.

రాగల 3 రోజుల వాతావరణ వివరాలు ఇలా..

ఆగష్టు 16 వ తేది :- విశాఖ, తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశంఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.

ఆగష్టు 17వ తేది :- విజయనగరం, విశాఖ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశంఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.

ఆగష్టు 18వ తేది :- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

Tags:    

Similar News