AP Tenth Exams: ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా?
AP Tenth Exams: ఏపీలో జూన్ ఏడు నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలు వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశం (ఫొటో దిహన్స్ ఇండియా)
AP Tenth Exams: ఏపీలో జూన్ ఏడు నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలు వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రస్తుతం పరీక్షలను నిర్వహించలేమని ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది.
కరోనా కారణంగా అనేక స్కూళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చినందున ఏర్పాట్లు చేయడం కష్టంగా మారిందన్నారు. కనీసం నెలరోజులపాటు వాయిదా వేస్తేనే మంచిదంటూ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. విద్యాశాఖ ప్రతిపాదనలపై రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.