ఏపీలో హై పిచ్‌కు చేరుకున్న పంచాయితీ హీట్

*ఘర్షణలు, ఉద్రిక్తతల మధ్య చివరి రోజు నామినేషన్స్ *శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఘర్షణ వాతావరణం *కర్రలు, బ్యాట్లు చేతపట్టి వైసీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ *యాదమర్రిలో టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణ

Update: 2021-02-01 03:00 GMT

ఏపీలో హై పిచ్‌కు చేరుకున్న పంచాయితీ హీట్

ఏపీలో పంచాయితీ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ హై పిచ్‌కు చేరుకుంటోంది. తొలివిడత నామినేషన్ల చివరి రోజు వరుస కిడ్నాప్‌లు కలకలం రేపితే.. మరికొన్ని చోట్ల ఊహించని రీతిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో ఏపీ పంచాయితీ వ్యవహారం మరింత ఉద్రిక్త కరంగా మారింది.

ఏపీలో తొలి విడత నామినేషన్ల పర్వం ముగిసింది. చివరిరోజు పోటాపోటీగా అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేశారు. ఇక నేడు అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల పర్వం ముగిసింది. నేడు అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నారు. తొలివిడతలో విజయనగరం జిల్లా మినహా 3249 పంచాయతీలకు, 32 వేల 504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నాడు నామినేషన్ల పర్వం మొదలయ్యింది. పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు పోటా పోటీగా నామినేషన్లు వేశారు.

మరోవైపు.. ఫిబ్రవరి 4 వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇచ్చారు. అదే రోజు బరిలో నిలిచిన అభ్యర్ధుల జాబితాను ప్రకటించడంతో పాటు గుర్తులను కేటాయించనున్నారు. మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 9న జరుగనుంది. అదే రోజు ఓట్లను లెక్కించి, ఫలితాలను వెల్లడించనున్నారు.

ఇక.. ఫిబ్రవరి 9న జరగనున్న ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 3 వేల 249 పంచాయతీలకు, 32 వేల 504 వార్డులకు జరగనున్న ఎన్నికలకు దాదాపు 13 వేల మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 168 మండలాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. రెండో దశ పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ ఫిబ్రవరి 2న నోటిఫికేషన్‌ ప్రకటించనుంది.

Tags:    

Similar News