YS Jagan: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. పంచాయతీలు ఏకగ్రీవమైతే భారీ నజరానా

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏవగ్రీవంగా ఎన్నిక జరిగితే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లతోపాటు వార్డు మెంబర్లు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగితే ప్రోత్సాహకాలు అందించనుంది.

Update: 2020-03-09 02:59 GMT
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి నెలకొంది. పంచాయతీ ఎన్నికలతోపాటు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోంతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. అన్ని పార్టీలు విజయం కోసం వ్యూహాలను రచిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏవగ్రీవంగా ఎన్నిక జరిగితే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లతోపాటు వార్డు మెంబర్లు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగితే ప్రోత్సాహకాలు అందించనుంది. గ్రామ జనాభా ఆధారంగా 5 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం నజరానా ఇవ్వనుంది. పంచాయతీరాజ్‌‌శాఖకు పలు ప్రతిపాదనలు పంపింది. దీంతో రెండు రోజుల్లో జీవో కూడా వెలువడే అవకాశం ఉందని అధికారులు అంటోన్నారు.

రాజకీయ పార్టీల గుర్తులతో గ్రామ పంచాయతీల ఎన్నికలు సంబంధం లేకుండా జరుగుతాయి. అందుకే ఏవగ్రీవంగా ఎన్నిక జరిగితే ప్రభుత్వం ప్రోత్సహకాలను ప్రకటించింది. ప్రభుత్వం కేవలం పంచాయతీ ఎన్నికలకు మాత్రమే ప్రోత్సహకాలను అందిచనుంది. గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రోత్సహకాలను అందజేయనుంది. గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ నిధులు అందుతున్నాయి. ఏకగ్రీవ ఎన్నికైయ్యే గ్రామాలకు స్థానికంగా పన్నుల రూపంలో పంచాయతీలు వసూలు చేసుకునే మొత్తానికి సమానంగా నిధులు అందజేసే అవకాశం ఉంది.

 

Tags:    

Similar News