ఎవరి మెడకో ఉచ్చు బిగిస్తుందనే ఒప్పుకున్నారు : ఎంపీ విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖలో నిగ్గు తేలాల్సిన అంశాలు మూడు ఉన్నాయన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

Update: 2020-04-16 09:33 GMT
Nimmagadda Ramesh Kumar, Vijay saireddy (File Photo)

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖలో నిగ్గు తేలాల్సిన అంశాలు మూడు ఉన్నాయన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆ మూడు అంశాలు.. ఇలా ఉన్నాయని పేర్కొన్నారు.. నిమ్మగడ్డ పేరుతో ఆ లేఖపై సంతకం చేసింది ఎవరు? లేఖను ఏ ఐపీ అడ్రస్ ద్వారా హోం శాఖ అధికారికి మెయిల్ చేశారు? ఆ లేఖను ఎక్కడ, ఎవరు డ్రాఫ్ట్ చేశారు? అనే వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలితే అందరూ బయటికి వస్తారని వ్యాఖ్యలు చేశారు.. అంతేకాదు కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై మీడియా వద్ద నోరు విప్పకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్ కు వెళ్లారని.. ఇప్పుడు ఎవరి మెడకో ఉచ్చు బిగిస్తుందన్న సమయంలో బయటికి వచ్చే తానే

లేఖను రాశానని ఒప్పుకున్నారని అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత నెల కిందట కేంద్ర హోమ్ శాఖకు లేఖ రాశారు.. అందులో తనకు ప్రాణహాని ఉందని కేంద్ర బలగాలు కావాలని పేర్కొన్నారు. అంతేకాదు స్థానిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం, ధనప్రవాహం లేకుండా ఉండేలా తెచ్చిన ఆర్డినెన్స్ ను తప్పుబట్టారు ఆయన. అయితే అప్పటినుంచి వైసీపీ, టీడీపీ ల మధ్య మాటల యుద్ధం ముదిరింది.



Tags:    

Similar News