AP MP Avanthi Srinivas about Bhimili Land Scam: భీమిలి భూ కుంభకోణంపై సిట్.. సీఎం అంగీకారం: మంత్రి అవంతి

AP MP Avanthi Srinivas about Bhimili Land Scam: విశాఖ భూ కుంభ కోణం... ఐదారేళ్లుగా ఎన్ని మలుపులు తిరుగుతుందో రాష్ట్ర వాసులకు తెలియని విషయం కాదు..

Update: 2020-07-18 03:15 GMT
Avanthi Srinivas (File Photo)

AP MP Avanthi Srinivas about Bhimili Land Scam: విశాఖ భూ కుంభ కోణం... ఐదారేళ్లుగా ఎన్ని మలుపులు తిరుగుతుందో రాష్ట్ర వాసులకు తెలియని విషయం కాదు... గత ప్రభుత్వం చంద్రబాబు హాయాంలోనే దీనిపై సిట్ వేశారు. దానిని నెలల తరబడి దర్యాప్తు చేసి, నివేదిక ప్రభుత్వానికి అందజేశారు. అది ఒక పక్కకు పోయింది. మరోమారు ఇదే కుంభ కోణంపై మరో దర్యాప్తు వేసేందుకు సీఎం అంగీకరించారని చెబుతున్నారు. మరి ఇది ఏ కంచికి వెళుతుందో చూడాల్సిందే.

తెలుగుదేశం హయాంలో ఇసుక, మద్యం మాఫియాలు విజృఃభించాయని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. భీమిలో జరిగిన భూ కుంభకోణంపై సిట్ ను వేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని ఆయన తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అభివృద్ధి విషయంలో ఎలాంటి వివక్షత ఉండదన్నారు. భీమిలిలోని జరిగిన భూ కంభకోణాన్ని ఆధారాలతో సహా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఇచ్చామన్నారు. ఆయన దీనిపై సిట్‌కు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. దేవాలయాల విషయంలో టీడీపీ రాజకీయం చేస్తోందని, గో సంరక్షణే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

 

Tags:    

Similar News