Use the Services of Physicians: వైద్యుల సేవలు వినియోగించుకోండి.. ఏపీ వైద్యశాఖ ఆదేశాలు

Use the Services of Physicians: రాష్ట్రంలో ఎక్కడ చూసినా తీవ్రస్థాయిలో నమోదవుతున్న కేసులను చూస్తే ఆందోళన కలిగిస్తోంది.

Update: 2020-07-23 02:00 GMT
Doctors Tests

Use the Services of Physicians: రాష్ట్రంలో ఎక్కడ చూసినా తీవ్రస్థాయిలో నమోదవుతున్న కేసులను చూస్తే ఆందోళన కలిగిస్తోంది. కొన్నిచోట్ల మరణాలు భయం కలిగిస్తున్నాయి. మరణాలు సంభవించిన చోట మృతదేహలను వదిలి వెళుతున్న దుస్థితి. ఇదే పరిస్థితి మరి కొన్నాళ్లు కొనసాగితే ఆస్పత్రుల్లో బెడ్ లు సైతం ఖాళీగా ఉండవు. డాక్టర్లు సైతం చాలని పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు ఎలాగైనా తమ వంతు ప్రయత్నం చేయాలి. ఇదే ఏపీ ప్రభుత్వం ముందున్న సవాలు. అందుకే వీలైనంత వరకు రోగులకు విస్తారంగా వైద్యం అందించి, ఒడ్డున పడేయాలనే ప్లాన్ రూపొందించింది. ఈ క్రమంలో దానికి అనుగుణంగా చర్యలు చేపడుతోంది.

ఇది అత్యంత ఆపత్సమయం. కరోనా మహమ్మారి కోరలుచాచి విజృంభిస్తోంది. ఈ సమయంలో బాధితులకు సత్వరమే వైద్యమందించి, వారిని కరోనా వైరస్‌ నుంచి విముక్తులను చేయడంలో వైద్యులు కీలకపాత్ర పోషిస్తున్నారని, వీరి సేవలు ఇప్పుడు మరింత అవసరమని సర్కారు భావిస్తోంది. ప్రభుత్వ వైద్యులే కాదు ప్రైవేటు వైద్యులు కూడా కరోనా నియంత్రణ విధుల్లో పాల్గొని సేవలందించాల్సిగా వైద్య ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ వైద్యులున్నారో గుర్తించి వాళ్లందరి సేవలు వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వైద్యులే కాకుండా నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, వలంటీర్లు, అసోసియేషన్‌ల సభ్యులు, యూత్‌క్లబ్‌లు ఇలాంటి వాళ్లందరినీ భాగస్వామ్యం చేయాలని కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టం చేశారు.

వలంటీర్ల సేవలు కూడా..

► కోవిడ్‌ సేవల కోసం ముందుకొచ్చే స్వచ్ఛంద సంస్థల సభ్యులను తీసుకోవాలి.

► ఆయుష్‌ డాక్టర్లందరినీ తక్షణమే విధుల్లోకి రప్పించాలి.

► ప్రైవేటు క్లినిక్‌లు నిర్వహిస్తున్న ఎంబీబీఎస్‌ డాక్టర్లను, ఎన్‌సీసీ వలంటీర్లందరినీ వినియోగించుకోవాలి.

► కోవిడ్‌ సేవల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి రక్షణ కిట్‌లు ప్రభుత్వం ఇస్తుంది.

Tags:    

Similar News