ఏపీ స్థానిక సంస్థల జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లు ఇవే..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు సంబంధించి ఓ కొలిక్కి వస్తున్నాయి.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు సంబంధించి ఓ కొలిక్కి వస్తున్నాయి. ఏపీ హైకోర్టు సూచనల మేరకు రిజర్వేషన్లు జిల్లా మేజిస్ట్రేట్ ఖరారు చేశారు. అందుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది. రాష్ట్ర ప్రభుత్వం తుది జాబితాను ఎన్నికల సంఘానికి పంపించనుంది. పూర్తి వివరాలు ఈ http://sec.ap.gov.in/ లో పొందుపరిచారు.
శ్రీకాకుళం జిల్లా జడ్పీటీసీ రిజర్వేషన్లు:
♦ ఇచ్చాపురం- బీసీ (మహిళ), కంచిలి - బీసీ (జనరల్)
♦ సోంపేట - జనరల్, మందస - బీసీ (మహిళ)
♦ పలాస - జనరల్, వజ్రపుకొత్తూరు - జనరల్
♦ నందిగం - బీసీ (జనరల్), టెక్కలి - ఎస్సీ (జనరల్)
♦ సంతబొమ్మాళి - జనరల్ (మహిళ), కొత్తబొమ్మాళి - జనరల్ (మహిళ)
♦ జలుమూరు - బీసీ (జనరల్), మెలియపుట్టి - జనరల్ (మహిళ)
♦ పాతపట్నం - ఎస్టీ (మహిళ), సారవకోట - బీసీ (జనరల్)
♦ హిర మండలం - జనరల్ (మహిళ), కొత్తూరు - ఎస్టీ (మహిళ)
♦ బామిని - జనరల్, సీతంపేట - ఎస్టీ (జనరల్), వీరఘట్టం - బీసీ (జనరల్)
♦ వంగర - జనరల్, పాలకొండ - ఎస్సీ (జనరల్)
♦ రేగిడి ఆమదాలవలస - ఎస్సీ (మహిళ), రాజాం - బీసీ (మహిళ)
♦ సంతకవిటి - బీసీ (మహిళ), జి.సిగడం - బీసీ (మహిళ)
♦ పొందూరు - జనరల్ (మహిళ), ఆమదాలవలస - బీసీ (మహిళ)
♦ బూర్జ - జనరల్, సరుబుజ్జిలి - జనరల్ (మహిళ)
♦ ఎల్ఎన్ పేట - జనరల్ (మహిళ), నరసన్నపేట - జనరల్
♦ పోలకి - జనరల్ (మహిళ), గార - జనరల్
♦ శ్రీకాకుళం - జనరల్ (మహిళ), ఎచ్చెర్ల - జనరల్
♦ లావేరు - ఎస్సీ (మహిళ), రణస్థలం - బీసీ (మహిళ)
విజయనగరం జిల్లా జడ్పీటీసీ రిజర్వేషన్లు:
♦ పాచిపెంట-ఎస్టీ (జనరల్), సాలూరు-ఎస్టీ (జనరల్)
♦ జీఎల్‌పురం-ఎస్టీ (మహిళ), కురుపాం-ఎస్టీ (మహిళ)
♦ బలిజిపేట-ఎస్టీ (జనరల్), సీతానగరం-ఎస్టీ (జనరల్)
♦ బొబ్బిలి-ఎస్సీ (మహిళ), తెర్లాం-ఎస్సీ (మహిళ)
♦ గజపతినగరం-బీసీ (జనరల్), గంట్యాడ-బీసీ (జనరల్)
♦ గరివిడి-బీసీ (జనరల్), మెరకముడిదం-బీసీ (జనరల్)
♦ చీపురుపల్లి-బీసీ (మహిళ), కొత్తవలస-బీసీ (మహిళ)
♦ పూసపాటిరేగ-బీసీ (మహిళ),ఆర్‌బీపురం-బీసీ (మహిళ)
♦ ఎస్.కోట-బీసీ (మహిళ), బాడంగి-జనరల్, బొండపల్లి-జనరల్
♦ గరుగుబిల్లి-జనరల్, గుర్ల-జనరల్, మక్కువ-జనరల్, మెంటాడ-జనరల్
♦ నెల్లిమర్ల-జనరల్, వేపాడ-జనరల్, విజయనగరం-జనరల్
♦ భోగాపురం-జనరల్ (మహిళ), దత్తిరేజేరు-జనరల్ (మహిళ)
♦ డెంకాడ-జనరల్ (మహిళ), జామి-జనరల్ (మహిళ)
♦ జియ్యమ్మవలస-జనరల్ (మహిళ), కొమరాడ-జనరల్ (మహిళ)
♦ ఎల్.కోట-జనరల్ (మహిళ), పార్వతీపురం-జనరల్ (మహిళ)
విశాఖ జిల్లా జడ్పీటీసీ రిజర్వేషన్లు:
♦ చింతపల్లి - ఎస్టీ, జీకే వీధి - ఎస్టీ (మహిళ)
♦ అరకు వ్యాలీ - ఎస్టీ (మహిళ), జి.మాడుగుల (ఎస్టీ)
♦ పెదబయలు - ఎస్టీ, హుకుంపేట - ఎస్టీ, పాడేరు - ఎస్టీ (మహిళ)
♦ డుంబ్రిగూడ - ఎస్టీ (మహిళ), ముచ్చంగిపుట్టు - ఎస్టీ (మహిళ)
తూర్పుగోదావరి జిల్లా జడ్పీటీసీ రిజర్వేషన్లు:
♦ అయినవిల్లి-ఎస్సీ, అల్లవరం-ఎస్సీ (మహిళ), అమలాపురం-ఎస్సీ
♦ అంబాజీపేట-ఎస్సీ (మహిళ), కాట్రేనికోన-ఎస్సీ, కొత్తపేట-ఎస్సీ (మహిళ)
♦ మలికిపురం-ఎస్సీ (మహిళ), పి.గన్నవరం-ఎస్సీ, రావులపాలెం-బీసీ
♦ రాజోలు-ఎస్సీ (మహిళ), సఖినేటిపల్లి-ఎస్సీ (మహిళ), ఉప్పలగుప్తం-ఎస్సీ
♦ కాకినాడ రూరల్-బీసీ, తాళ్లరేపు-బీసీ, యు.కొత్తపల్లి-బీసీ
♦ జగ్గంపేట-బీసీ (మహిళ), శంఖవరం-ఎస్సీ (మహిళ), తొండంగి-బీసీ
♦ తుని-బీసీ (మహిళ), బిక్కవోలు-బీసీ (మహిళ), మండపేట-బీసీ (మహిళ)
♦ అడ్డతీగల-ఎస్టీ, దేవీపట్నం-ఎస్టీ (మహిళ), గంగవరం-ఎస్టీ (మహిళ)
♦ మారేడుమిల్లి-ఎస్టీ, రాజవొమ్మంగి-ఎస్టీ (మహిళ), రంపచోడవరం-ఎస్టీ (మహిళ)
♦ వై.రామవరం-ఎస్టీ (మహిళ), కడియం-బీసీ (మహిళ), కోరుకొండ-బీసీ
♦ రాజమహేంద్రవరం-బీసీ (మహిళ), రాజానగరం-బీసీ, చింతూరు-ఎస్టీ
♦ కూనవరం-ఎస్టీ (మహిళ), వీఆర్‌పురం-ఎస్టీ, ఏటపాక-ఎస్టీ
♦ ఆత్రేయపురం-జనరల్, ఐ.పోలవరం-జనరల్, మామిడికుదురు-జనరల్
♦ ముమ్మడివరం-జనరల్, గొల్లప్రోలు-జనరల్, కరప-జనరల్
♦ పెదపూడి-జనరల్ (మహిళ), పిఠాపురం-జనరల్
♦ సామర్లకోట-జనరల్ (మహిళ), గండేపల్లి-జనరల్ (మహిళ)
♦ కిర్లంపూడి-జనరల్ (మహిళ), కోటనందూరు-జనరల్ (మహిళ)
♦ పెద్దాపురం-జనరల్, ప్రత్తిపాడు-జనరల్ (మహిళ), రంగంపేట-జనరల్
♦ రౌతులపూడి-జనరల్, ఏలేశ్వరం-జనరల్ (మహిళ)
♦ అనపర్తి-జనరల్ (మహిళ), కె.గంగవరం-జనరల్ (మహిళ)
♦ కాజులూరు-జనరల్, కపిలేశ్వరపురం-జనరల్, రామచంద్రపురం-జనరల్
♦ రాయవరం-జనరల్ (మహిళ), ఆలమూరు-జనరల్ (మహిళ)
♦ గోకవరం-జనరల్ (మహిళ), సీతానగరం-జనరల్ (మహిళ)
పశ్చిమగోదావరి జిల్లా జడ్పీటీసీ రిజర్వేషన్లు:
♦ వేలేరుపాడు - ఎస్టీ (మహిళ), బుట్టాయిగూడెం - ఎస్టీ (మహిళ)
♦ జీలుగుమిల్లి - ఎస్టీ, పోలవరం - ఎస్టీ (మహిళ), కుక్కునూరు - ఎస్టీ
♦ గోపాలపురం - ఎస్సీ (మహిళ), చింతలపూడి - ఎస్సీ (మహిళ)
♦ కొవ్వూరు - ఎస్సీ (మహిళ), దేవరపల్లి - ఎస్సీ (మహిళ)
♦ దెందులూరు - ఎస్సీ (మహిళ), నల్లజర్ల - ఎస్సీ (మహిళ)
♦ నిడదవోలు - ఎస్సీ, ద్వారకాతిరుమల - ఎస్సీ, లింగపాలెం - ఎస్సీ
♦ కామవరపుకోట - ఎస్సీ, పెదవేగి - ఎస్సీ, పెదపాడు - బీసీ (మహిళ)
♦ ఉండి - బీసీ (మహిళ), భీమడోలు - బీసీ (మహిళ), పాలకోడేరు - బీసీ (మహిళ)
♦ ఉంగుటూరు - బీసీ (మహిళ), భీమవరం - బీసీ, కాళ్ల - బీసీ
♦ మొగల్తూరు - బీసీ, నర్సాపురం - బీసీ, తణుకు - జనరల్ (మహిళ)
♦ ఏలూరు - జనరల్ (మహిళ), తాళ్లపూడి -జనరల్ (మహిళ)
♦ కొయ్యలగూడెం - జనరల్ (మహిళ), పెనుమంట్ర - జనరల్ (మహిళ)
♦ చాగల్లు - జనరల్ (మహిళ), గణపవరం - జనరల్ (మహిళ)
♦ పెరవలి - జనరల్ (మహిళ), పెంటపాడు - జనరల్ (మహిళ)
♦ అత్తిలి - జనరల్ (మహిళ), పెనుగొండ - జనరల్ (మహిళ)
♦ ఆకివీడు - జనరల్, పాలకొల్లు - జనరల్, కోడూరు - జనరల్
♦ నిడమర్రు - జనరల్, ఆచంట - జనరల్, ఇరగవరం - జనరల్
♦ జంగారెడ్డిగూడెం - జనరల్, వీరవాసరం - జనరల్, తాడేపల్లిగూడెం - జనరల్
♦ ఉండ్రాజవరం - జనరల్, యలమంచిలి - జనరల్, టి.నర్సాపురం - జనరల్
చిత్తూరు జిల్లా జడ్పీటీసీ రిజర్వేషన్లు:
♦ బి.కొత్తకోట - బీసీ, బైరెడ్డిపాలెం - ఎస్సీ, బంగారుపాలెం - ఎస్సీ
♦ బుచ్చినాయుడు కండ్రిగ - జనరల్ (మహిళ), చంద్రగిరి - జనరల్
♦ చిన్నగొట్టిగల్లు - జనరల్ (మహిళ), చిత్తూరు - జనరల్, చౌడేపల్లి - జనరల్
♦ జీడీ నెల్లూరు - బీసీ, గంగవరం - బీసీ (మహిళ), గుడిపాల - ఎస్సీ (మహిళ)
♦ గుడుపల్లె - బీసీ, ఐరాల - జనరల్ (మహిళ), గుర్రంకొండ - జనరల్ (మహిళ)
♦ కేవీబీపురం - ఎస్సీ (మహిళ), కంభంవారిపల్లె - జనరల్ (మహిళ)
♦ కలకాడ - ఎస్సీ (మహిళ), కలికిరి - బీసీ (మహిళ), కార్వేటినగరం - ఎస్సీ (మహిళ)
♦ కుప్పం - బీసీ, కురబలకోట - జనరల్ (మహిళ), మదనపల్లె - బీసీ
♦ ములకలచెరువు - జనరల్, నాగాలపురం - జనరల్ (మహిళ)
♦ నగరి - ఎస్సీ, నారాయణవనం - ఎస్సీ, నిమ్మనపల్లి - జనరల్ (మహిళ)
♦ నింద్ర - జనరల్ (మహిళ), పెద్దతిప్పసముద్రం - జనరల్
♦ పాకాల - బీసీ (మహిళ), పలమనేరు - జనరల్
♦ పాలసముద్రం - ఎస్సీ, పెద్దమాండ్యం - జనరల్ (మహిళ)
♦ పెదపంజని - బీసీ (మహిళ), పెనుమూరు - బీసీ
♦ పీలేరు - జనరల్, పిచ్చాటూరు - జనరల్ (మహిళ), పులిచర్ల-జనరల్
♦ పుంగనూరు - బీసీ (మహిళ), పూతలపట్టు - ఎస్సీ (మహిళ)
♦ పుత్తూరు - జనరల్ (మహిళ), రామచంద్రపురం - జనరల్ (మహిళ)
♦ రామకుప్పం - ఎస్టీ, రామసముద్రం - జనరల్, రేణిగుంట - జనరల్ (మహిళ)
♦ రొంపిచర్ల - జనరల్, శాంతిపురం- బీసీ, సత్యవేడు - జనరల్
♦ సోదం - జనరల్, సోమల - బీసీ (మహిళ), శ్రీకాళహస్తి - జనరల్
♦ శ్రీరంగరాజపురం - జనరల్, తంబళ్లపల్లి - జనరల్ (మహిళ)
♦ తవనంపల్లి - ఎస్సీ (మహిళ), తొట్టంబేడు - ఎస్సీ (మహిళ)
♦ తిరుపతి రూరల్ - ఎస్టీ (మహిళ), వాదమలపేట - జనరల్
♦ వాల్మీకిపురం - బీసీ (మహిళ), వరదాయపాలెం - ఎస్టీ (మహిళ)
♦ వెదురుకుప్పం - ఎస్సీ, వెంకటగికోట - బీసీ (మహిళ)
♦ విజయపురం - జనరల్ (మహిళ), యాదమర్రి - జనరల్
♦ ఏర్పేడు - ఎస్సీ, యర్రావారిపాలెం - జనరల్
అనంతపురం జిల్లా జడ్పీటీసీ రిజర్వేషన్లు:
♦ ఆగలి - జనరల్, ఆమడగురు - జనరల్ (మహిళ)
♦ అమరాపురం - ఎస్సీ (మహిళ), అనంతపురం - ఎస్సీ (జనరల్)
♦ ఆత్మకూరు - జనరల్, బుక్కరాయసముద్రం - ఎస్సీ (జనరల్)
♦ బత్తలపల్లి - జనరల్, బెలుగుప్ప - జనరల్ (మహిళ)
♦ బొమ్మనహల్ - బీసీ (మహిళ), బ్రహ్మసముద్రం - బీసీ (మహిళ)
♦ బుక్కపట్నం - జనరల్ (మహిళ), చెన్నేకొత్తపల్లి - జనరల్
♦ చిలమత్తూరు - బీసీ (మహిళ), హీరేహల్ - బీసీ (మహిళ)
♦ ధర్మవరం - జనరల్, గాండ్లపెంట - జనరల్ (మహిళ)
♦ గార్లదిన్నె - ఎస్సీ (మహిళ), గుత్తి - జనరల్, గోరంట్ల - ఎస్టీ (జనరల్)
♦ గుదిబండ - ఎస్సీ (జనరల్), గుమ్మగట్ట - బీసీ (జనరల్)
♦ గుంతకల్లు - బీసీ (జనరల్), హిందూపురం - బీసీ (జనరల్)
♦ కదిరి - ఎస్టీ (మహిళ), కల్యాణదుర్గం - బీసీ (జనరల్)
♦ కంబదూరు - ఎస్సీ (జనరల్), కనగానపల్లె - జనరల్
♦ కనేకల్ - బీసీ (మహిళ), కొత్తచెరువు - జనరల్ (మహిళ)
♦ కూడేరు - జనరల్ (మహిళ), కుందుర్పి - బీసీ (జనరల్)
♦ లేపాక్షి - జనరల్, మడకశిర - ఎస్సీ (మహిళ), ముదిగుబ్బ - ఎస్సీ (మహిళ)
♦ నంబులపులకుంట - జనరల్ (మహిళ), నల్లచెరువు - జనరల్ (మహిళ)
♦ నల్లమడ - జనరల్, నార్పల - ఎస్సీ (మహిళ), ఓబులదేవచెరువు - జనరల్
♦ పామిడి - జనరల్ (మహిళ), పరిగి - ఎస్సీ (జనరల్)
♦ పెద్దపప్పూరు - జనరల్ (మహిళ), పెద్దవడుగూరు - జనరల్
♦ పెనుగొండ - జనరల్, పుట్లూరు - జనరల్ (మహిళ)
♦ పుట్టపర్తి - జనరల్ (మహిళ), రామగిరి - జనరల్
♦ రాప్తాడు - జనరల్, రాయదుర్గం - బీసీ (జనరల్)
♦ రొద్దం - బీసీ (మహిళ), రోళ్ల - జనరల్, సెట్టూరు - బీసీ (జనరల్)
♦ సింగనమల - జనరల్ (మహిళ), సోమందేపల్లి - బీసీ (జనరల్)
♦ తాడిమర్రి - జనరల్ (మహిళ), తాడిపత్రి - బీసీ (మహిళ)
♦ తలుపుల - జనరల్ (మహిళ), తనకల్లు - జనరల్ (మహిళ)
♦ ఉరవకొండ - ఎస్సీ (మహిళ), వజ్రకరూరు - బీసీ (మహిళ)
♦ విడపనకల్లు - బీసీ (జనరల్), యాడికి - బీసీ (మహిళ), ఎల్లనూరు - జనరల్
వైఎస్ఆర్ జిల్లా జడ్పీటీసీ రిజర్వేషన్లు:
♦ కొండూరు - ఎస్టీ, పుల్లంపేట - ఎస్టీ
♦ పెనగలూరు - ఎస్సీ (జనరల్), పోరుమామిళ్ల - ఎస్సీ (జనరల్)
♦ ఓబులవారిపల్లి - ఎస్సీ (జనరల్), బి.కోడూరు - ఎస్సీ (జనరల్)
♦ పుల్లంపేట - ఎస్సీ (మహిళ), ప్రొద్దుటూరు - ఎస్సీ (మహిళ)
♦ ఖాజీపేట - ఎస్సీ (మహిళ), రాజంపేట - ఎస్సీ (మహిళ)
♦ చాపాడు - ఎస్సీ (మహిళ), మైలవరం - బీసీ (మహిళ)
♦ జమ్మలమడుగు - బీసీ (మహిళ), కొండాపురం - బీసీ (మహిళ)
♦ ముద్దనూరు - బీసీ (మహిళ), చిన్నమండ్యం - బీసీ (మహిళ)
♦ గాలివీడు - బీసీ (మహిళ), ఎల్‌ఆర్ పల్లి - బీసీ (మహిళ)
♦ దువ్వూరు - బీసీ (జనరల్), ఎర్రగుంట్ల - బీసీ (జనరల్)
♦ టి.సుండుపల్లి - బీసీ (జనరల్), వీరబల్లి - బీసీ (జనరల్)
♦ పెండ్లిమర్రి - బీసీ (జనరల్), లింగాల - బీసీ (జనరల్)
♦ రామాపురం - బీసీ (జనరల్), వల్లూరు - బీసీ (జనరల్)
♦ నందలూరు - జనరల్ (మహిళ), రాజుపాలెం - జనరల్ (మహిళ)
♦ తుండూరు - జనరల్ (మహిళ), సాంబేపల్లి - జనరల్ (మహిళ)
♦ సింహాద్రిపురం - జనరల్ (మహిళ), పెద్దముడియం - జనరల్ (మహిళ)
♦ చెన్నూరు - జనరల్ (మహిళ), చిట్టివేల్ - జనరల్ (మహిళ)
♦ వీఎన్ పల్లి - జనరల్ (మహిళ), మైదుకూరు - జనరల్ (మహిళ)
♦ అట్లూరు - జనరల్ (మహిళ), కమలాపురం - జనరల్ (మహిళ)
♦ రాయచోటి - జనరల్, సిద్ధవటం - జనరల్, సీకే దిన్నె - జనరల్
♦ ఒంటిమిట్ట - జనరల్, కలసపాడు - జనరల్, బద్వేల్ - జనరల్
♦ వేముల - జనరల్, వేంపల్లి - జనరల్, కాశినాయిని- జనరల్
♦ పులివెందుల - జనరల్, చక్రాయపేట - జనరల్
♦ గోపవరం - జనరల్, బి.మఠం - జనరల్
నెల్లూరు జిల్లాలో
46 జడ్పిటీసీ స్థానాలకు ఎస్టీ 5, ఎస్సీ 12, బీసీ 6,జనరల్‌కు 23 రిజర్వేషన్లు కేటాయించారు. మొత్తం 562 ఎంపీటీసీ స్థానాలకు ఎస్టీ 65, ఎస్సీలు-146, బీసీలు-59, జనరల్ 292 రిజర్వేషన్లు కేటాయించారు.