Andhra Pradesh: శాసనమండలి వాయిదా

శానసమండలి వాయిదా పడింది. బిల్లుల చర్చ విషయమై రెండు పక్షాల మద్య లేచిన వివాదం చివరకు వాయిదాకు దారితీసింది.

Update: 2020-06-18 03:07 GMT

శానసమండలి వాయిదా పడింది. బిల్లుల చర్చ విషయమై రెండు పక్షాల మద్య లేచిన వివాదం చివరకు వాయిదాకు దారితీసింది. దీంతో పాటు ఈ విషయంపై ఇరు పక్షాల మద్య తోపులాట జరిగింది. ఈ ఘటనను కొంతమంది అడ్డుకోవడంతో పరిస్థితి సద్దు మణిగింది.

శాసనసభ ఆర్డర్‌లో లేకపోవడంతో డిప్యూటీ చైర్మన్ మండలిని నిరవధిక వాయిదా వేశారు. అంతకుముందు సభలో ద్రవ్య వినిమయ బిల్లును పెట్టాలని ప్రతిపక్షం, రాజధాని బిల్లులు పెట్టాలని అధికారపక్షం మధ్య వాగ్వాదం నడిచింది. చివరకు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ చేపట్టాలని డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అధికారపక్షాన్ని ఆదేశించారు.

అధికారపక్షం చర్చ ప్రారంభించకపోవడంతో రూల్ నెంబర్ 90పై చర్చను చేపట్టాలని యనమలకు రెడ్డి సుబ్రమణ్యం సూచించారు. చర్చను రూల్ నెంబర్ 90 కింద యనమల ప్రారంభించారు. యనమల ప్రసంగాన్ని అధికారపక్షం నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. చివరకు సభ ఆర్డర్‌లో లేకపోవడంతో శాసనమండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. సభ వాయిదా అనంతరం అధికార, ప్రతిపక్షాల సభ్యుల మధ్య తోపులాట జరిగింది.


Tags:    

Similar News