AP Inter Board reduce syllabus: ఇంటర్ సిలబస్ కుదింపు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

AP Inter Board reduce syllabus: జూన్ లో ప్రారంభం కావాల్సిన తరగతులు ఆగష్టు నెల వస్తున్నా అతీ గతీ లేదు... మరో రెండు, మూడు నెలల్లో తరగతులు ప్రారంభిస్తారంటే దానికి నమ్మకం లేదు...

Update: 2020-08-17 01:42 GMT
ap inter

AP Inter Board reduce syllabus: జూన్ లో ప్రారంభం కావాల్సిన తరగతులు ఆగష్టు నెల వస్తున్నా అతీ గతీ లేదు... మరో రెండు, మూడు నెలల్లో తరగతులు ప్రారంభిస్తారంటే దానికి నమ్మకం లేదు... ఈ విధంగా చూస్తే సగం విద్యా సంవత్సరం సెలవులతోనే గడిచిపోయేలా ఉంది. ఈ ఏడాది విస్తరించిన కరోనా వల్ల విద్యావ్యవస్థ మొత్తం అతలాకుతలం అయ్యింది. దీంతో విద్యా సంవత్సరంలో పూర్తి సిలబస్ చెప్పే అవకాశం లేదు. అందుకే ముందుగానే వాటికి సంబంధించిన బోర్డులు సిలబస్ ను కుదిస్తూ చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతానికి ఇంటర్ సిలబస్ 30 శాతానికి కుదించేందుకు రంగం సిద్ధం చేసింది. వీటికి సబంధించి ఏయే పాఠ్యాంశాలను కుదించారో ఇంటర్ కు సంబంధించిన వెబ్ సైట్లో పొందుపరిచారు.

కోవిడ్‌–19 నేపథ్యంలో విద్యాసంవత్సరంలో కాలేజీల్లో బోధన సాగించే పరిస్థితి లేకపోవడం, తరగతుల నిర్వహణ ఆలస్యం కానుండడంతో ఇంటర్మీడియెట్‌ బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర కుదించింది. ఈ మేరకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి కుదించిన సిలబస్‌ సమాచారాన్ని బోర్డు వెబ్‌సైట్లో పొందుపరిచింది. సైన్స్, ఆర్ట్స్‌ సబ్జెక్టులకు సంబంధించి బోధనాంశాలు ఏవి? కుదింపు అంశాలు ఏవో వివరిస్తూ పాఠ్యాంశాల వారీగా వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టింది.

లాంగ్వేజ్‌లకు సంబంధించి కూడా ఒకటి రెండు రోజుల్లో వివరాలు అప్‌లోడ్‌ చేయనున్నారు. కోవిడ్‌–19 కారణంగా సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి సిలబస్‌ను 30 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే బాటలో ఏపీ ఇంటర్మీడియెట్‌ బోర్డు సిలబస్‌ కుదింపు చర్యలు చేపట్టింది. ఇలా ఉండగా, ఇంటర్మీడియెట్‌ 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఆయా అభ్యర్థుల తాజా మార్కులతో కూడిన షార్ట్‌ మార్కుల మెమోలను కూడా బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచింది. అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని

సూచించింది.

Tags:    

Similar News