త్వరలో ఏపీలో డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉద్యోగాల భర్తీ: జవహర్ రెడ్డి

Update: 2020-05-23 16:23 GMT
Jawahar Reddy (File Photo)

ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలోనే వైద్య విభాగాన్ని మరింత పటిష్టం చేయనున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. ఇదే క్రమంలో 9,700 మంది డాక్టర్లు, అదేవిధంగా  ఇతర వైద్య సిబ్బంది ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు జవహర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ పెరుగుదల దృష్ట్యా మరిన్ని జాగరతలు తీసుకుంటామన్నారు. కరోనా నియంత్రణకు కూడా సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.

ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వారి దృష్ట్యా వివిధ ఆసుపత్రులలో అదనపు బెడ్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 8 జిల్లాల్లో 30 వేల ఐసోలేషన్ పడకలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అలాగే 12 వెలవరకు ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేస్తున్నామని అన్నారు.

మహారాష్ట్ర, గుజరాత్ నుండి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించి అనుమానం వస్తే ఐసొలేషన్ కి తరలిస్తామని తెలిపారు. అంతేకాకుండా  దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా అత్యధిక కరోనా టెస్టులు చేసిన రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉందని జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ త్వరలోనే తగ్గుముఖం పడుతుంది అని, ప్రజలు ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.   


Tags:    

Similar News