Andhra Pradesh: రేషన్ డీలర్లకు జగన్ సర్కార్ షాక్
Andhra Pradesh:రేషన్ డీలర్లకు జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది
Ration Dealers File Photo
Andhra Pradesh: రేషన్ డీలర్లకు జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన కమీషన్లో టీడీఎస్ కట్ చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో డీలర్ కు కమీషన్లో రూ .20 వేల వరకు కోత పడే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ నిర్ణయం పై రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు రేషన్ డీలర్ల సంఘం అధ్యక్ఝుడు మండాది వెంకట్రావు మాట్లాడుతూ... న్యాయంగా ఇచ్చే కమీషన్లో టీడీఎస్ పేరుతో కోత పెట్టడం అన్యాయమని వాపోయారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పని చేస్తే... ఇదేనా బహుమతి ఇదేనా అని నిలదీశారు. ఆనాడు అధికారులు చెప్పిందొకటి.. ఇప్పుడు చేస్తుందొకటి మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.