ఏపీలో వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం

ఇప్పటికే పలు రంగాల్లో సంస్కరణలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా వ్యవసాయ రంగంలోనూ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

Update: 2020-05-25 15:47 GMT
YS Jagan (File Photo)

ఇప్పటికే పలు రంగాల్లో సంస్కరణలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా వ్యవసాయ రంగంలోనూ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చెయ్యాలని సంకల్పించారు. ఇందులో పంటల విస్తరణ, పంట మార్పిడి వంటి అంశాల్లో రైతులకు సలహాలిచ్చేందుకు ఈ సలహా మండళ్లు ఏర్పాటు కానున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రధానంగా రైతుల ఆదాయం పెంచేందుకు మండళ్లు సలహాలు, సూచనలు ఇవ్వనున్నాయని పేర్కొంది. సోమవారం దీనిపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వ్యవసాయ మండళ్లు ఏర్పాటు కానున్నాయి.

రాష్ట్ర స్థాయిలో వ్యవసాయశాఖ మంత్రి ఈ సలహా కమిటీకి చైర్మన్‌గా ఉంటారు. అలాగే వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, వివిధ విభాగాల ప్రతినిధులతో కలిసి మొత్తం 27 మంది ఈ సలహా మండలిలో ఉంటారు. జిల్లా స్థాయిలో జిల్లా మంత్రి చైర్మన్ గా, కలెక్టర్ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, రైతు ప్రతినిధులు ఇందులో ఉంటారు. ఇక మండల స్థాయిలో ఎమ్మెల్యే చైర్మన్‌గా వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో మండలస్థాయి అధికారులు, రైతులు ప్రతినిధులుగా ఉండనున్నారు.   

Tags:    

Similar News