Thalliki Vandanam: తల్లులకు బిగ్ అలర్ట్..తల్లికి వందనం అమలుపై కీలక అప్ డేట్.. అకౌంట్లో డబ్బు వచ్చేది అప్పుడే!

Update: 2025-05-15 06:02 GMT

Thalliki Vandanam: తల్లులకు బిగ్ అలర్ట్..తల్లికి వందనం అమలుపై కీలక అప్ డేట్.. అకౌంట్లో డబ్బు వచ్చేది అప్పుడే!

Thalliki Vandanam: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ విజయంతో గెలిచింది. పిల్లలను చదివిస్తున్న తల్లులకు మాత్రం ఇది కలిగించలేదు. ఎందుకంటే గత వైసీపీ సర్కార్..గత ఏడాది అమ్మఒడి పథకం కింద ఇవ్వాల్సిన రూ. 13,000ఇవ్వలేదు. జూన్ 12 నుంచి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం..ప్రారంభించి, మనీ ఇస్తుందేమో అనుకుంటే అదీ కూడా జరగలేదు. ఇలా రెండు ప్రభుత్వాలు తమను మోసం చేశాయని తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త వస్తోంది.

కూటమి ప్రభుత్వం వచ్చే విద్యాఏడాదికి సంబంధించి అంటే జూన్ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందన పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ పథకాల్లో ఇది అతిపెద్ద స్కీమ్. దీన్ని అమలు చెయ్యాలంటే వేలకోట్లు కావాలి. అందుకే గతేడాది ప్రభుత్వం దీని జోలికి వెళ్లలేదు. ఈ ఏడాది కూడా దీన్ని అమలు చెయ్యకపోతే..ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. అందుకే అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై ఒక అప్ డేట్ వచ్చింది.

జూన్ 12న అమ్మఒడి స్కీమ్ ప్రారంభించేందుకు ప్రభుత్ం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇందుకు 2 కారణాలు ఉన్నాయి. వేసవి సెలవులు ముగిశాక..జూన్ 12న స్కూళ్లు ప్రారంభమవుతాయి. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది కూడా జూన్ 12వ తేదీ కావడంతో ఆరోజున రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించబోతోంది. తల్లులు, విద్యార్థుల కోసం తల్లికి వందనం స్కీమును కూడా ప్రారంభిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ తేదీని ప్రభుత్వం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఆ రోజే ఈ స్కీమ్ కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి స్కీమ్ డబ్బును ఒకే విడతలో రూ. 13,000 చొప్పున ఇస్తుండేది. అలా 42లక్షల మందికిపైగా తల్లుల బ్యాంక్ అకౌంట్లో రూ. 6వేల కోట్లకు పైగా జమ చేసేది. కానీ కూటమి సర్కార్ ప్రభుత్వం తల్లికి వందనం స్కీమ్ కింద రూ. 15,000 చొప్పున ఇస్తామని చెబుతోంది. ఇలా ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే..అంతమందికీ ఇస్తామని చెప్పుకొచ్చింది. ఈ స్కీమ్ అమలుకు కనీసం రూ. 15వేల కోట్ల నుంచి రూ. 20వేల కోట్ల వరకు అవసరం ఉంటుంది. 

Tags:    

Similar News