ఏపీలో దసరా, సంక్రాంతి సెలవుల్లో కోత?

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. లాక్ డౌన్ విధించడంతో కాలేజీలు, స్కూల్స్, కోచింగ్ సెంటర్స్, పరీక్షలు అన్ని వాయిదా పడ్డాయి..

Update: 2020-05-03 06:34 GMT
Representational Image

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. లాక్ డౌన్ విధించడంతో కాలేజీలు, స్కూల్స్, కోచింగ్ సెంటర్స్, పరీక్షలు అన్ని వాయిదా పడ్డాయి.. ఇక పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 2020-21 విద్యా సంవత్సర అకాడమిక్‌ క్యాలెండర్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. సాధారణంగా అయితే మార్చి, ఏప్రిల్ నెలలో పరీక్షలు నిర్వహించి సెలవులను ప్రకటిస్తారు. మళ్లీ జూన్ 12 తరవాత పాఠశాలను తిరిగి ప్రారంభిస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.

లాక్డౌన్ పొడిగింపు ప్రభావం నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ప్రారంభించి 2021 జూలై 31 వరకు కొత్త విద్యా సంవత్సరం ఉండేలా అకడమిక్ క్యాలెండర్ రూపొందించాలని భావిస్తుంది ఏపీ విద్యాశాఖ.. ఇక దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తేసిన రెండు వారాల తరువాత పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఇక రాష్ట్రంలో పెద్ద పండగ అయిన దసరా, సంక్రాంతి సెలవులను కూడా కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా అయితే ఈ పండుగలకు పది రోజులకి పైగానే సెలవలు ఇస్తారు. కానీ ఇప్పుడు కుదించే అవకాశం కనిపిస్తోంది. దీనిపైనే ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోంది. త్వరలో దీనిపైన తుది నిర్ణయం వెలువడనుంది.


Tags:    

Similar News