పెన్షన్ పంపిణీలో జగన్ సర్కార్ సంచలన రికార్డు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో రికార్డు సృష్టించింది. గ్రామ, వార్డు వాలంటీర్లు ఆదివారం ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.

Update: 2020-03-01 09:49 GMT
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో రికార్డు సృష్టించింది. గ్రామ, వార్డు వాలంటీర్లు ఆదివారం ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఒకటో తేదీకే పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం చెప్పడంతో వాలంటీర్లూ అందరూ కలిసి రికార్డు నెలకొల్పారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ.. 47 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ రోజు ముగిసే లోగా 60 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చి మరే రాష్ట్రమూ పంపిణీ చేయని సంఖ్యలో పెన్షన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించబోతోంది.

ఏపీ ప్రభుత్వం ఈసారి పెన్షన్ లబ్ధిదారుల సంఖ్యను మరింత పెంచనుంది. అదనంగా మరో 5 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తుంది. రాష్ట్ర బడ్జెట్‌లో 10 శాతం డబ్బును పెన్షన్‌ర్ల కోసమే కేటాయిస్తోంది. జనవరిలో నెలలో తమకు పింఛను రాలేదని ఫిర్యాదులు చేశారు. రీ వెరిఫికేషన్ చేసి ఈ నెలలో గత నెల పెన్షన్ కూడా కలిపి అందిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం 15 రకాల పెన్షన్లు ఇస్తోంది. వాటిలో వృద్ధులకు, వితంతువులు, చేనేత, గీత కార్మికులు, వితంతువులకు ఇలా రకరకాలు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వీళ్లందరికీ నెలకు 2250 రూపాయలు ఇస్తున్నారు. అలాగే... దివ్యాంగులు, హిజ్రాలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపతున్నవారికి నెలకు 3,000 రూపాయల ఇస్తున్నారు. అంతేనా... బోధకాలు, తలసేమియా వ్యాధిగ్రస్తులు,తో బాధపడుతున్నారు, డయాలసిస్ వారికి 5000 రూపాయలు ఇస్తోంది. ఇక పక్షవాతం, రక్తహీనతతో బాధపడేవారికి నెలకు 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. 60 లక్షల మందికి నెలకు పెన్షన్లు ఇస్తుండటం వల్ల ప్రభుత్వానికి నెలకు రూ.1320.76 భారం పడుతోంది.

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలూ కలిపి 60 లక్షలు దాటేశారు. కొత్తగా ఐదు లక్షల మంది లబ్దిదారులుగా మారారు. జనవరిలో 54,68,323 మంది నుంచీ పెన్షన్లు పొందారు. ఫిబ్రవరిలో నుంచి పెన్షన్ పొందేవారి మొత్తం 60 లక్షలకు చేరుకున్నారు. మరి ఈ లబ్దిదారుల్లో ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లాలో 6,23,0932 మంది పెన్షన్లు అందుకుంటున్నారు. ఇక విజయనగరం జిల్లాలో పెన్షన్ లబ్ధీదారులు తక్కువగా ఉన్నారు. వారి సంఖ్య చూస్తే 3,02,734 మంది విజయనగరం జిల్లాలో పెన్షన్ పొందుతున్నారు.

  Full View

Tags:    

Similar News