Andhra Pradesh: జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులు, పార్టీ అధ్యక్షుల నియామకం

Andhra Pradesh: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్న జిల్లాల ఇన్ ఛార్జ్ లు

Update: 2022-04-20 01:20 GMT

జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులు, పార్టీ అధ్యక్షుల నియామకం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ టీమ్ 2024ను ప్రకటించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ టీమ్ ను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌చార్జి మంత్రులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఈ నియమకాలు జరిగాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను, పాలనపరమైన వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

గుంటూరు జిల్లాకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, కాకినాడకు సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం జిల్లాకు బొత్స సత్యన్నారాయణ, అనకాపల్లి జిల్లాకు డిప్యూటీ సీఎం రాజన్న దొర, అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం మన్యం జిల్లాలకు గుడివాడ అమర్నాథ్ . విజయనగరం జిల్లాకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, విశాఖకు విడుదల రజనిని ఇంచార్జి మంత్రులుగా నియమించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కోనసీమ జిల్లాకు జోగి రమేష్, పశ్చిమగోదావరి జిల్లాకు దాడిశెట్టి రాజా, ఏలూరు జిల్లాకు విశ్వరూప్, కృష్ణా జిల్లాకు ఆర్కే రోజా నియామకం అయ్యారు. ఎన్టీఆర్ జిల్లాకు హోంమంత్రి తానేటి వనిత, పల్నాడు జిల్లాకు కారుమూరి నాగేశ్వర్ రావు, బాపట్లకు డిప్యూటీ సీఎం కొట్టు సత్యన్నారాయణ, ప్రకాశం జిల్లాకు మేరుగ నాగార్జున నియమితులయ్యారు.

నెల్లూరు జిల్లాకు మంత్రి అంబటి రాంబాబు, కర్నూలు జిల్లాకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నంద్యాలకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, అనంతపురం జిల్లాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంచార్జ్ మంత్రులుగా నియమితులయ్యారు. సత్యసాయి జిల్లాకు గుమ్మనూరు జయరాం, వైఎస్సార్ కడప జిల్లాకు ఆదిమూలపు సురేష్, అన్నమయ్య జిల్లాకు కాకాణి గోవర్దన్ రెడ్డి, తిరుపతి జిల్లాకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చిత్తూరు జిల్లాకు ఉషశ్రీచరణ ను ఇన్ ఛార్జి మంత్రులుగా నియమిస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ టీమ్ 2024ను ప్రకటించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ టీమ్ ను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌చార్జి మంత్రులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఈ నియమకాలు జరిగాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను, పాలనపరమైన వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ మంత్రులు

జిల్లా పేరు ఇన్‌చార్జి మంత్రి

1 గుంటూరు ధర్మాన ప్రసాదరావు

2 కాకినాడ సీదిరి అప్పల రాజు

3 శీ​కాకుళం బొత్స సత్యనారాయణ

4 అనకాపల్లి రాజన్న దొర

5 ఏఎస్‌ఆర్‌ఆర్‌ గుడివాడ అమర్నాథ్‌

6 విజయనగరం బూడి ముత్యాల నాయుడు

7 పశ్చిమ గోదావరి దాటిశెట్టి రాజా

8 ఏలూరు పినిపె విశ్వరూప్‌

9 తూర్పుగోదావరి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్‌

10 ఎన్టీఆర్‌ తానేటి వనిత

11 పల్నాడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు

12 బాపట్ల కొట్టు సత్యనారాయణ

13 అమలాపురం జోగి రమేష్‌

14 ఒంగోలు మేరుగ నాగార్జున

15 విశాఖపట్నం విడదల రజిని

16 నెల్లూరు అంబటి రాంబాబు

17 కడప ఆదిమూలపు సురేష్‌

18 అన్నమయ్య కాకాణి గోవర్థన్‌రెడ్డి

19 అనంతపురం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

20 కృష్ణా ఆర్కే రోజా

21 తిరుపతి నారాయణ స్వామి

22 నంద్యాల అంజాద్‌ బాషా

23 కర్నూలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

24 సత్యసాయి గుమ్మనూరి జయరాం

25 చిత్తూరు కేవి ఉషాశ్రీ చరణ్‌

26 పార్వతీపురం గుడివాడ అమర్నాథ్‌

Full View


Tags:    

Similar News