Free LPG Cylinder: ఏపీలో ఉచిత గ్యాస్ డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో పడవు..మరి ఎలా ఆ డబ్బులను పొందాలి?
Free LPG Cylinder: ఏపీ ప్రభుత్వం దీపం 2 పథకంలో కీలక మార్పులను తీసుకొచ్చింది. ఇక నుంచి లబ్దిదారులకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు రాయితీ నేరుగా చేరేలా కొత్త విధానం తెచ్చింది.
Free LPG Cylinder: ఏపీలో ఉచిత గ్యాస్ డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో పడవు..మరి ఎలా ఆ డబ్బులను పొందాలి?
Free LPG Cylinder: ఏపీ ప్రభుత్వం దీపం 2 పథకంలో కీలక మార్పులను తీసుకొచ్చింది. ఇక నుంచి లబ్దిదారులకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు రాయితీ నేరుగా చేరేలా కొత్త విధానం తెచ్చింది. సాకేంతికను ఉపయోగించి రాయితీని లభ్దిదారుల వ్యాలెట్‌కు పంపుతుంది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఏపీ ప్రభుత్వం దీపం 2 కింద లబ్దిదారులకు ఏడాదికి 3 సిలెండర్లు ఉచితంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు బ్యాంక్ అకౌంట్లలోకి కాకుండా నేరుగా వ్యాలెట్ లోకి వెళ్లేలా కొత్త మార్పులు ప్రభుత్వం తీసుకొచ్చింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రాజెక్ట్‌ను ఒక గ్యాస్ ఏజెన్సీలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది గనక విజయవంతమైతే రాష్ట్రమంతటా అమలు చేస్తారు. దీపం 2 పథకం లబ్దిదారులు ఇకపై నేరుగా గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు చెల్లించవచ్చు. ఒక ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు సిలిండర్ సబ్సిడీ డబ్బులు ఈ యాప్‌లో ఉన్న వ్యాలెట్‌లో పడతాయి. అప్పుడు పథకం లబ్దిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు ఏజెన్సీ బిల్లుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ డబ్బులు నేరుగా గ్యాస్ ఏజెన్సీకి చేరేలా ప్లాన్ చేశారు.
గతంలో అయితే ఈ పథకంలో లబ్దిదారులు ముందుగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసి డబ్బులు కట్టేవాళ్లు, ఆ తర్వాత ప్రభుత్వం రాయితీని వారి బ్యాంక్ అకౌంట్లలో వేసేవారు. ఇకపై అలా కాకుండా ప్రభుత్వం రాయితీ డబ్బుల్ని నేరుగా వ్యాలెట్కు పంపుతుంది. అంటే లబ్దిదారులు గ్యాస్ సిలిండర్ కోసం ముందుగా డబ్బుల్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు.