ఈనెల 26 నుంచి మలివిడత ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

Update: 2019-06-12 15:59 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 26ను మరోసారి మొదలు కానున్నాయి. 20 రోజులపాటు సాగే ఈ సమావేశాల్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఇందుకోసం ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈనెల 18న ఈ సమావేశాలు ముగియనున్నాయి. తిరిగి మరో వారంరోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా స్పీకర్, ఎన్నిక గురువారం జరగనుండగా, శుక్రవారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రసంగిస్తారు. జూన్ 15, 16 తేదీలు సెలవు కావడంతో మళ్లీ 17, 18 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. ఈ రెండు రోజులు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది.

Tags:    

Similar News