Curfew: మధ్యాహ్నం 12 తర్వాత బస్సులు బంద్

Curfew: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.

Update: 2021-05-04 10:37 GMT

Curfew: మధ్యాహ్నం 12 తర్వాత బస్సులు బంద్

Curfew: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కోవిడ్ పరిస్థితులపై కీలకంగా చర్చించింది కేబినెట్. రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూ నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో మధ్యాహ్నం 12గంటల తర్వాత ఎక్కడా జనసంచారం లేకుండా ఉండేందుకు పోలీసులు, ఇతర యంత్రాంగం సమన్వయంతో పనిచేసి కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు నుంచి ఆక్సిజన్‌ రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

రేపటి నుంచి కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. 12 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు నడపకూడదని నిర్ణయించారు. ఉదయం 11.30 గంటల వరకే కళాశాలల నిర్వహణకు అవకాశం ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలకు అనుమతి ఇవ్వాలని.. మధ్యాహ్నం నుంచి ప్రజా రవాణా వాహనాలను నిలిపేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిచిపోనున్నాయి.

Tags:    

Similar News